తెలంగాణ

telangana

ETV Bharat / state

ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై నేడు కీలక సమావేశం - ఆ కమిటీతో సీఎం రేవంత్‌ భేటీ - Five Members Committee Dharani

CM Revanth Reddy Meet Dharani Committee Today : ధరణి పోర్టల్‌ సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీతో ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కానున్నారు. తాము గుర్తించిన సమస్యలు, పరిష్కార మార్గాలపై వారు ముఖ్యమంత్రికి వివరించనున్నారు. అనంతరం ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

CM Revanth Reddy
CM Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 8:08 AM IST

Updated : Feb 24, 2024, 8:56 AM IST

CM Revanth Reddy Meet Dharani Committee Today : ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది. ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్న కమిటీతో నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ కానున్నారు. ధరణి సమస్యలను పరిష్కరించి భూమాతగా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. మొదట సమస్యలపై అధ్యయనం కోసం ప్రభుత్వం భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కన్వీనర్‌గా కిసాన్ కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, న్యాయవాది సునీల్, విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌తో కమిటీని ఏర్పాటు చేసింది.

Five Members Committee on Dharani Portal : ధరణి కమిటీ (Dharani Committee) ఇప్పటికే పలు శాఖల అధికారులు, కొందరు కలెక్టర్లతో సమావేశమైంది. ధరణి వల్ల రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, పరిష్కార మార్గాలపై కమిటీ నేడు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించనుంది. వారి సూచనల మేరకు ప్రభుత్వం త్వరలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌పై(Dharani) కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ధరణి స్థానంలో భూమాతను(Bhoomatha) తీసుకొస్తామని హస్తం పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా తొలుత పోర్టల్‌లో సాంకేతికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని దానిని పునర్నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ధరణి పోర్టల్​ను కొనసాగిస్తారా? లేదా? - స్పష్టత ఇవ్వండి : హైకోర్టు

ఇందులో భాగంగా ధరణి కమిటీ రాష్ట్రంలో భూసమస్యలు, పరిష్కార మార్గాలపై పలువురు కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు నిర్వహించింది. అందులో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ధరణిలో ఒక సమస్యకు మరో సమస్యకు పొంతన లేకుండా పోయిందని తెలిపింది. పోర్టల్‌ ప్రారంభం నుంచే అనేక లోపాలు ఉన్నాయని పేర్కొంది. తెలంగాణలో భూసమస్యలను పరిష్కరించాలంటే ధరణి సాఫ్ట్‌వేర్‌ను మార్చితే సరిపోదని, చట్టాలను సైతం మార్చాల్సిన అవసరం ఉందని కమిటీ ప్రాథమికంగా అభిప్రాయం వ్యక్తం చేసింది.

Dharani Portal Problems 2024 :ధరణి పోర్టల్‌ నిర్వహణ సంస్థ టెర్రాసిస్‌ ప్రతినిధులతోనూ కమిటీ చర్చించింది. ధరణి సాఫ్ట్‌వేర్‌కు (Dharani Portal Problems) సంబంధించి మాడ్యుల్స్‌ ఎలా పనిచేస్తున్నాయి? దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు ఏ ఏ దశల్లో సాఫ్ట్‌వేర్‌ ఎలా పని చేస్తుంది? ఎదురవుతున్న సమస్యలపై లోతుగా ఆరా తీసింది. సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని మాడ్యుల్స్‌ అవసరమని, అదేవిధంగా దరఖాస్తు నుంచి పరిష్కారం వరకు అంతా ఆన్‌లైన్‌లోనే ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ధరణి వ్యవస్థ సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూర్చేట్లు లేదని కమిటీ పేర్కొంది. 35 మ్యాడ్యూల్స్‌ ప్రజలకు ఉపయోగపడేట్లు లేవని తేల్చింది. 18 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తుండగా, 23 లక్షలు ఎకరాలు పార్ట్‌-బీలో ఉన్నట్లు వారి దృష్టికి వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా పోర్టల్‌లోని ఐచ్ఛికాల్లో కీలక మార్పులు సూచించింది. భూ సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు ఉండాలని వివరించింది. ఈ నేపథ్యంలోనే రెవెన్యూశాఖకు ప్రాథమికంగా కమిటీ సభ్యులు సూచించినట్లు తెలిసింది.

'కొంతమందికి భరణంగా, చాలా మందికి ఆభరణంగా భారంగా మారిన ధరణి'

ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు! - ధరణి పోర్టల్​లోని వివరాల సేకరణపై సర్కార్ ప్రత్యేక నజర్

Last Updated : Feb 24, 2024, 8:56 AM IST

ABOUT THE AUTHOR

...view details