CM Revanth on Rajiv Gandhi statue : యువతలో స్ఫూర్తి నింపేందుకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయం సమీపంలో రాజీవ్‌గాంధీ విగ్రహం(Rajiv Gandhi statue) ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఓ వైపు సచివాలయం, మరోవైపు అమరవీరుల స్థూపం ట్యాంక్‌బండ్‌పై ఎందరో త్యాగమూర్తుల విగ్రహాలు ఉన్నాయని, దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఆదర్శ నాయకుడి విగ్రహం సచివాలయ పరిసరాల్లో లేకపోవడం లోటుగా కనిపించిందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth reddy) పేర్కొన్నారు. ఆ లోటును తీర్చడానికి భారీ స్థాయిలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్
Rajiv Gandhi statue at secretariat :నాటి రాజీవ్‌గాంధీ పాలనలో తీసుకున్న నిర్ణయాలు దేశంలో సాంకేతిక, టెలికాం రంగానికి బలమైన పునాదులు వేశాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తండాల నుంచి పట్టణాల వరకు ప్రజలు మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ ఈరోజు ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారంటే దానికి రాజీవ్‌గాంధీ పాలన సంస్కరణల ఫలితమే అని వెల్లడించారు. దేశానికి రాజీవ్‌గాంధీ సేవలు చిరస్మరణీయమన్నారు. దేశ యువతకు ఆయన ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.
మనం విగ్రహాలు ఏర్పాటు చేసేది జయంతి, వర్దంతి రోజు దండలు వేయడానికి, నివాళులు అర్పించడానికి కాదు. మనం ఏదైనా పనికి వెళ్తున్నప్పుడు వారిని చూస్తే మనకు స్ఫూర్తి కలగాలి. అందుకే సచివాలయం సమీపంలో విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాము. ఈ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. ఆరోజు సద్భావనయాత్ర సందర్భంగా రాజీవ్‌గాంధీ చార్మినార్ వద్ద పెద్దలు హన్మంతరావు సమక్షంలో జెండా ఆవిష్కరించారు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
మన రాష్ట్రం 60 సంవత్సరాల ఆకాంక్ష, ఈ కలను తీర్చింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ కృషి మరువరానిది. సోనియా గాంధీ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ భారీ స్థాయిలో చేయనున్నాము. రాజీవ్‌గాంధీ విగ్రహ తయారీపై ఆర్ అండ్ బి అధికారులు ప్రత్యేక శ్రద్దతో దృష్టి సారించాలని సీఎం సూచించారు.
"యువతలో స్ఫూర్తి నింపేందుకే సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఆదర్శ నాయకుడి విగ్రహం సచివాలయ పరిసరాల్లో లేకపోవడం లోటుగా కనిపించింది, ఆ లోటును తీర్చడానికి రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము. సోనియా గాంధీ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ భారీ స్థాయిలో చేస్తాము".- రేవంత్‌రెడ్డి, సీఎం
యువతలో స్ఫూర్తి నింపేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు రేవంత్‌రెడ్డి మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా - కేసీఆర్ ఎలా వస్తారో చూస్తా : రేవంత్ రెడ్డి
కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు - సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్