తెలంగాణ

telangana

ETV Bharat / state

30 రోజుల్లో డిజిటల్‌ హెల్త్‌కార్డులను తీసుకువస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి - CM Revanth On Digital Health Cards - CM REVANTH ON DIGITAL HEALTH CARDS

CM Revanth On Digital Health Cards : మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సీఎం, విద్య, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

CM Revanth Key Announcement On Digital Health Cards
CM Revanth Key Announcement On Digital Health Cards (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2024, 6:11 PM IST

Updated : Sep 26, 2024, 6:50 PM IST

CM Revanth Key Announcement On Digital Health Cards : నెలలోపు కుటుంబ డిజిటల్‌ హెల్త్‌ కార్డులను తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ డిజిటలైజ్‌ చేస్తామన్నారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని, ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుపరుస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. క్యాన్సర్‌ చికిత్స కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని, సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రి దామోదర రాజనర్సింహకు సూచించారు.

"తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్లమంది ప్రజలకు హెల్త్​ ప్రొఫైల్​ డిజిటలైజ్​ కార్డులు చేయాలని అధికారులకు ఆదేశించాం. దీనివల్ల పేషెంట్​కు గతంలో ఉన్న వ్యాధుల వివరాలను సులభంగా ట్రాక్​ చేయవచ్చు. ఏ రకంగా వైద్యులు ట్రీట్​ చేసున్నారో కూడా తెలుస్తుంది. దీంతో డాక్టర్​ నెక్స్ట్​ ఏరకంగా ముందుకు వెళ్లాలో వెసులుబాటు కలుగుతుంది. అందుకోసం మరో 30 రోజుల్లోనే ఫ్యామిలీ డిజిటల్​ హెల్త్​ కార్డును తీసుకువస్తాం."-రేవంత్​రెడ్డి, ముఖ్యమంత్రి

Last Updated : Sep 26, 2024, 6:50 PM IST

ABOUT THE AUTHOR

...view details