CM Revanth Reddy Jharkhand Tour :కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఝార్ఖండ్‌లో కొనసాగుతోంది. సబ్కే లియే న్యాయ్ అనేదే ఈ యాత్ర సందేశమని ఆయన చెబుతున్నారు. ఇందులో భాగంగా యువత, మహిళలు, బలహీనవర్గాల ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తూ వారి బాధలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు రామ్‌గఢ్ మీదుగా రాంచీకి చేరుకోనున్నారు. అక్కడ ధుర్వలోని షాహీద్ మైదానంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.
CM Revanth Reddy Visit Jharkhand : రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి రాంచీ బయల్దేరారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు. మంగళవారం గాంధీ భవన్‌లో రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ఉండటంతో ఇవాళ రాత్రికే ఆయన తిరిగి వస్తారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Rahul Gandhi Bharat Jodo Nyay Yatra :సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు (Bharat Jodo Nyay Yatra)శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తీవ్ర అలర్లు చెలరేగిన మణిపుర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి జనవరి 14న యాత్రను మొదలుపెట్టారు. మణిపుర్ నుంచి ముంబయి వరకు సుమారు 6713 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ యాత్ర హైబ్రిడ్ పద్ధతిలో చాలా వరకు బస్సులో, కొంతమేర పాదయాత్ర ద్వారా కొనసాగనుంది.
రాహుల్ గాంధీ కారుపై రాళ్లదాడి! కాంగ్రెస్ భిన్న ప్రకటనలు- ఏం జరిగింది?