CM Revanth Reddy Comments On BRS:ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని కానీ గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం తనకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో 99 మంది ఏఎంవీఐలకు సీఎం ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు.
10 నెలల్లో ఏం కోల్పోయిందో ప్రజలు తెలుసుకున్నారని ఒక పెద్దాయన అంటున్నారని తెలంగాణ ఏం కోల్పోలేదని పెద్దాయన ఇంట్లో నలుగురు ఉద్యోగాలు కోల్పోయారని సీఎం రేవంత్ విమర్శించారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటైనా కట్టిందా అని ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్ కట్టలేదు కానీ ఆయన మాత్రం 10 ఎకరాల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని అన్నారు. 2011లో రాష్ట్రంలో చివరిసారిగా గ్రూప్-1 నిర్వహించారని దాదాపు 13 ఏళ్లపాటు గ్రూప్-1 నిర్వహించలేదని తెలిపారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా పట్టుబట్టి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించానని త్వరలో గ్రూప్-1 నియామకపత్రాలు అందజేస్తాని తెలిపారు.
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అప్పట్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బాట పట్టారని కానీ గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 50 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించడం నాకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో 99 మంది ఏఎంవీఐలకు సీఎం ఉద్యోగ నియామకపత్రాలు అందజేశారు.