CM Revanth Reddy Foundation of Kodangal Lift Irrigation : ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన ఆయన, నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.4,369 కోట్లు విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను(Stalls) పరిశీలించారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని ఆయన తెలిపారు. ఐకేపీ, మహిళా సంఘాల(Women's Groups) ద్వారా పంటల కొనుగోళ్లు జరిపిస్తామని హామీ ఇచ్చారు.
ఇంకా యుద్ధం ముగియలేదు - ఇది విరామం మాత్రమే : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Initiates Kodangal Development Programs :మక్తల్, నారాయణపేట, కొండగల్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన కొండగల్- నారాయణపేట ఎత్తిపోతల పథకానికి రూ.2,945 కోట్ల అంచనా వ్యయంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే ఆర్అండ్బీ అతిథి గృహం, డబుల్ లేన్ రోడ్లు, బ్రిడ్జిలు, గిరిజన సంక్షేమ హాస్టల్ భవనం, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ శాశ్వత భవనం, దౌల్తాబాద్ జూనియర్ కాలేజి, బొమ్రాస్పేట్ జూనియర్ కాలేజీ, మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.