CM Revanth Reddy Delhi Tour Updates :ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కసరత్తు చేస్తోంది. బడ్జెట్ రూపకల్పన సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కేంద్రం నుంచి ప్రత్యేకంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చే నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అందుకు అనుగుణంగా రాష్ట్ర వాటా కేటాయించి, విడుదల చేయడం ఎప్పటికప్పుడు యూసీలు సమర్పించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్(Otan Account Budget 2024)లో ప్రతిపాదనలు రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల రూపంలో రూ.21 వేల కోట్లకు పైగా వస్తాయని తెలంగాణ ప్రభుత్వం అంచనా. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాల కింద కనీసం రూ.19 వేల కోట్లు రాబట్టుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
Telangana CM Revanth in Delhi :సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రధానిని కలిసిన రేవంత్ రెడ్డి పలు విజ్ఞప్తులు చేశారు. ఆ వెంటనే కేంద్ర ఆర్థిక సంఘం(Central Finance Corporation) నిధులు రాష్ట్రానికి రూ.600 కోట్లు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అదే తరహాలో పెండింగ్ నిధులను కేంద్రం నుంచి పొందడంపై సర్కార్ దృష్టి సారించింది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి బకాయిలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.1800 కోట్లు రావాల్సి ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి మరో రూ.450 కోట్లు కలిపితే రూ.2250 కోట్లు అవుతాయి. వాటన్నింటిపై దిల్లీలో కేంద్రమంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చర్చించే అవకాశముంది. అందుకే వీరితో పాటు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దిల్లీ వెళ్లారు.
రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన సీఎం రేవంత్, భట్టి