Young India Skill University Chairman Anand Mahindra : తెలంగాణ స్కిల్ వర్సిటీ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, న్యూజెర్సీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఉండేందుకు ఆనంద్ మహీంద్రా అంగీకరించారని, కొద్ది రోజుల్లోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సీఎం తెలిపారు.
తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగినవారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ భవనానికి రంగారెడ్డి జిల్లా బ్యాగరికంచె వద్ద శంకుస్థాపన చేసినట్టు సీఎం గుర్తుచేశారు. ఈ యూనివర్సిటీలో 17 రకాల కోర్సుల్లో ప్రతి ఏడాది, 20వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్ ఇవ్వడం సహా ఆయా కంపెనీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
యూనివర్సిటీ ఛాన్సలర్‌గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి :స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరు కోర్సులతో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనివర్సిటీ ఛాన్సలర్‌గా గవర్నర్ లేదా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో పేర్కొన్నారు. పరిశ్రమల ప్రముఖులతో పాలకమండలి ఏర్పాటు చేయనున్నారు.