CM Revanth Padma Awardees Wishes 2024 : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 5 మందికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించగా వారిలో ఏపీకి చెందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవి ఉన్నారు. పద్మశ్రీ పురస్కారం 34 మందికి ప్రకటించగా తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులను ఈ పురస్కారం వరించింది. జనగామకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లాకు చెందిన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప అవార్డుల జాబితాలో ఉన్నారు. ఈ తరుణంలో పద్మ అవార్డు గ్రహీతలకు ప్రముఖలు అభినందనలు తెలుపుతున్నారు.
Padma Vibhushan Awardees Telangana 2024 :పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన దాసరి కొండప్ప, జనగామకు చెందిన గడ్డం సమ్మయ్యను (Pdma Sri Gaddam Sammayya) ఎక్స్ వేదికగా అభినందించారు. అద్భుతమైన కళా నైపుణ్యంతో వీరిద్దరూ తెలంగాణ సంస్కృతి కళను దేశమంతటా చాటి చెప్పారని సీఎం రేవంత్ ప్రశంసించారు.
తెలుగు రాష్ట్రాల్లో 'పద్మ' పురస్కారం వరించిన కళాకారులు వీళ్లే
EX CM KCR Wishes To Padma Award Winners 2024 : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ నటుడు చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ (Padma Vibhushan 2024) వరించడం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ప్రజా సంస్కృతికి ప్రతీక అయిన చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ (Padma Sri) అవార్డు దక్కడం పట్ల కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.