CM Revanth Delhi Tour :దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో సమావేశమయ్యారు. గంట పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రి మండలిలో మార్పులు చేర్పులపై ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు రాహుల్, ప్రియాంక, సోనియాగాంధీలను ఆహ్వానించారని, అలాగే రెండు లక్షల రుణ మాఫీ చేసినందుకు వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
కేంద్రమంత్రులతో భేటీ :ఈ భేటీ అనంతరం సీఎంరేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర టెలికాం, కమ్యునికేషన్లశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డీపీఆర్‌ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. 65,000 ప్రభుత్వ సంస్థలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించడం. గ్రామీణ ప్రాంతాల్లో రూ.63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.30 లక్షల గృహాలకు నెలకు కేవలం రూ. 300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు టీ- ఫైబర్ ప్రధాన ఉద్దేశమని కేంద్రమంత్రికి వివరించారు. టీ-ఫైబర్‌కు రూ. 1779 కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రి సింధియాకు విన్నవించారు.