తెలంగాణ

telangana

ETV Bharat / state

రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ - రామోజీరావును కలిసిన రేవంత్​రెడ్డి

CM Revanth Meet Ramojirao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదిలాబాద్​ పర్యటనలో పాల్గొన్న అనంతరం నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి ముఖ్యమంత్రి చేరుకున్నారు. రామోజీ గ్రూప్ కార్పొరేట్​ కార్యాలయంలో రామోజీరావును కలిశారు. ముఖ్యమంత్రికి రామోజీరావు బొకే ఇచ్చి సాదర స్వాగతం పలికారు.

CM Revanth in Ramoji Film City
CM Revanth Meet Ramojirao

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 9:59 PM IST

CM Revanth Meet Ramojirao : రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదిలాబాద్​ పర్యటనలో పాల్గొన్న అనంతరం నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి ముఖ్యమంత్రి చేరుకున్నారు. రామోజీ గ్రూప్ కార్పొరేట్​ కార్యాలయంలో రామోజీరావును కలిశారు. ముఖ్యమంత్రికి రామోజీరావు(Ramojirao) బొకే ఇచ్చి సాదర స్వాగతం పలికారు.

రామోజీరావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతున్న తీరు, ప్రజాపాలన విధానాలపై చర్చించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి రాజకీయాలు కూడా భేటీలో చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో ఈనాడు ఎండీ కిరణ్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​ రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.

రామోజీరావుతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details