తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే లోక్​సభ ఎన్నికలు - మోదీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధం : రేవంత్‌రెడ్డి - CM Revanth Kerala Samaragni Sabha

CM Revanth Fires on BJP in Kerala : కేంద్రంలో కొలువైన బీజేపీ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు బీజేపీలో లేరని చెప్పారు. దేశాభివృద్ధిలో కమలం పార్టీ ఎలాంటి పాత్ర పోషించలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికలు మోదీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Mar 1, 2024, 10:54 AM IST

మోదీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమే : రేవంత్ రెడ్డి

CM Revanth Fires on BJP in Kerala :దేశానికి లౌకిక, ప్రజాస్వామిక, అవినీతి రహిత పాలన అందించడం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. బీజేపీ దేశ లౌకిక, ప్రజాస్వామిక విధానాలను తుంగలో తొక్కి అవినీతిని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. మోదీకి ప్రత్యామ్నాయం హస్తం పార్టీనేనని తెలిపారు. కేరళలోని తిరువనంతపురంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర పీసీసీ, సీఎల్పీ విభాగాలు సమరాగ్ని పేరుతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొని ప్రసగించారు.

Revanth Fires on PM Modi :కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు బీజేపీలో లేరని అన్నారు. దేశాభివృద్ధిలో కమలం పార్టీ ఎలాంటి పాత్ర పోషించలేదని పేర్కొన్నారు. దేశం మొత్తం ప్రధాని మోదీపై యుద్ధం చేయాలని భావిస్తోందని అన్నారు ఇవి కేవలం ఎన్నికలు మాత్రమే కాదని మోదీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధమని తెలిపారు. ఇందులో మనం గెలవాలని, ఇండియా కూటమిని గెలిపించుకోవాలని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా - కేసీఆర్​ ఎలా వస్తారో చూస్తా : రేవంత్​ రెడ్డి

Revanth Reddy Comments on KCR : "ఇండియా కూటమిని బలహీన పరిచేందుకు మూడో ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జరిగే కుట్రలకు కేసీఆర్(KCR) సహకరిస్తున్నారు. ఈ కుట్రలకు సహకరిస్తున్న కేసీఆర్‌కు, ఆయనకు కేరళలో సహకరిస్తున్న స్థానిక శక్తులను ఓడించాల్సిందే. తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ, అవినీతిమయ విధానాలు దేశవ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని కలుషితం చేశాయి. కాంగ్రెస్‌ను గెలిపించడం ద్వారానే ప్రజాస్వామిక, లౌకిక శక్తులకు బలం చేకూరుతుంది." అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్​ సర్కార్​ అవినీతిని ఊరూరా చాటి చెప్పండి - పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్​రెడ్డి పిలుపు

బీజేపీపై పోరాటంలో కేరళలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికలు ఎన్డీయే- ఇండియా కూటమిల మధ్య అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఇక్కడి ప్రజలు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఈసారి కేరళలో మొత్తం 20 లోక్‌స్థానాల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. తెలంగాణలో ఈసారి 16 స్థానాలకు గానూ 14 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణాతోపాటు కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా కొనసాగుతున్న దీపాదాస్‌ మున్షీ, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్‌ వేణుగోపాల్‌ రావు పాల్గొన్నారు.

"బీజేపీ అవినీతి పాలనను ప్రోత్సహిస్తుంది. లౌకిక, ప్రజాస్వామిక, అవినీతిరహిత పాలన కాంగ్రెస్‌తోనే సాధ్యం. మోదీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమే. దేశం మొత్తం మోదీపై యుద్ధం చేయాలి. వచ్చే ఎన్నికలు మోదీని ఓడించేందుకు జరుగుతున్న యుద్ధం. ఎన్నికల యుద్ధంలో ఇండియా కూటమిని గెలిపించుకోవాలి.ఇండియా కూటమిని బలహీనపరిచేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050 విజన్ దిశగా ముందుకు : సీఎం రేవంత్​రెడ్డి

యువతలో స్ఫూర్తి నింపేందుకే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు : రేవంత్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details