ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనుల్లో నాణ్యత లేకపోతే గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి - సీఎం చంద్రబాబు ఆదేశం - ROADS SITUATION IN AP

రోడ్ల మరమ్మతుల పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష- గ్రామాల నుంచి హైవేలకు అనుసంధానంపై దృష్టిపెట్టాలని ఆదేశం

CM Chandrababu Review on Roads Repairs in AP
CM Chandrababu Review on Roads Repairs in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 9:41 AM IST

CM Chandrababu Review on Roads Repairs in AP :రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి నాణ్యతతో చేయాలని, నామమాత్రంగా చేస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తేల్చి చెప్పారు. సంక్రాంతి కల్లా రోడ్ల మరమ్మతుల పూర్తి చేయాలని ఆదేశించారు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోయే రోడ్ల టోల్‌ విషయంలో ఏఏ వాహనాలుకు మినహాయింపు ఇవ్వొచ్చో పరిశీలించాలని నిర్దేశించారు.

'ఏపీ రాజధాని నిర్మాణానికి మరో రూ.16 వేల కోట్ల రుణం'

అలా చేస్తే సహించేది లేదు : రోడ్ల మరమ్మతుల పనులపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఆర్​అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే, ఈఎన్‌సీ నయిముల్లా, సీఈ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 861 కోట్లతో చేపట్టిన మరమ్మతుల పనులపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. పనుల నాణ్యతపై ప్రైవేటు సంస్థల ద్వారా నివేదికలు తెప్పించాలని సీఎం ఆదేశించారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 10 రోజుల పాటు ఈ దర్శనాలు రద్దు

22 వేల 299 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉందని ఇప్పటికే 19 వందల 91 కిలోమీటర్ల మేర గుంతల్ని పూడ్చే పనులు పూర్తయినట్లు అధికారులు సీఎంకి వివరించారు. 14 వందల 47 కిలోమీటర్ల మేర రోడ్లు మరమ్మతులు చేయలేనంత ఘోరంగా ఉన్నాయని, వాటి స్థానంలో పూర్తిగా కొత్త రోడ్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు. వాటి కోసం 581 కోట్లు వ్యయమవుతుందని చెప్పారు. త్వరలో నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. రహదారులపై గుంతల్ని పూడ్చే పనుల్ని మొక్కుబడిగా చేపడితే సహించేదిలేదని సీఎం స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తి నాణ్యతతో ఉండాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలన్నారు. సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లు అందుబాటులోకి తేవాలని నిర్దేశించారు.

గ్రామాల్లోనూ హైవే తరహా రోడ్లు - తొలి విడతలో 18రూట్లు ఎంపిక

రోడ్ల అభివృద్ధికి డీపీఆర్‌ : ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో అభివృద్ధి చేయనున్న రోడ్లపై సీఎం చర్చించారు. రోడ్ల టోల్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లతోపాటు ఇంకా వేటికి మినహాయింపులు ఇవ్వొచ్చో పరిశీలించాలని నిర్దేశించారు. ప్రజలపై భారం వేయకుండా వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ను రోడ్ల నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. 10 వేల 200 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయొచ్చని అధికారులు వివరించారు. మొదటి దశలో 13 వందల 7 కిలోమీటర్ల మేర 18 రోడ్ల అభివృద్ధికి డీపీఆర్‌లను త్వరగా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ

పంచాయతీలకు కేంద్రం 275 కోట్లు విడుదల :న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ పనుల్లో వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోని 68 వేల కిలోమీటర్ల మేర అంతర్గత రహదారులు ఉండగా వాటిలో 55 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్లని తెలిపారు. ఇందులో 25 వేల కిలోమీటర్ల మేర గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించినవేనన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 6 వేల కిలోమీటర్ల మేర మాత్రమే పనులు చేశారన్నారు. గ్రామాల్లో మిగిలిన అంతర్గత రోడ్లను సిమెంట్‌ రోడ్లుగా చేసే పనులను పంచాయతీలకు కేంద్రమిచ్చే నిధులు, నరేగా పనుల కింద చేయాలని ఆదేశించారు. తాజాగా పంచాయతీలకు కేంద్రం 275 కోట్లు విడుదల చేసిందని, వాటితోనూ ఈ పనులు చేపట్టాలని నాబార్డు నిధులు వెచ్చించాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం ఉండేలా రోడ్ల నిర్మాణంపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.

రహదారుల కోసం సీఎం చంద్రబాబు వినూత్న ఆలోచన - గోదావరి జిల్లాల నుంచే అమలు

మంచిరోజులొచ్చాయ్​ - గుంతల రోడ్లకు మరమ్మతులు

ABOUT THE AUTHOR

...view details