CM Jagan on YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని మరీ ఏపీ సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో అబద్దాలు వల్లె వేశారు. హత్యకు కుట్ర పన్నింది, హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం చేసింది కడప ఎంపీ అవినాష్‌రెడ్డేనని సీబీఐ అభియోగపత్రంలోనే స్పష్టం చేసింది. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా హత్య చేయించారనే అనుమానం ఉందని తెలిపింది.
YS Viveka Murder Case Updates :వివేకాతో అవినాష్‌రెడ్డికి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి విభేదాలు ఉండటంతోనే ఈ కుట్రకు తెరలేపారని సీబీఐ తేల్చింది. భాస్కరరెడ్డిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండులో ఉంచింది. అవినాష్‌రెడ్డిని సాంకేతికంగా కాగితాలపై అరెస్టు చేసి వెంటనే బెయిల్ ఇచ్చేసింది. సీబీఐ ఇంత స్పష్టంగా అభియోగపత్రాల్లో వెల్లడిస్తే ఇంకా వివేకాను ( Viveka Murder Case) ఎవరు చంపారో అందరికీ తెలుసనడం ఏంటనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
Sunitha on Viveka Case: అప్పుడే అవినాష్ రెడ్డిపై అనుమానం మొదలైంది: సునీత
దర్యాప్తు అధికారిపైనే కేసు:సీఎం జగన్ అన్నది నిజమే వివేకా హత్య కేసులో (YS Viveka murder case) ఎనిమిదో నిందితుడైన అవినాష్ రెడ్డి దర్జాగా బయట తిరుగుతున్నారు. ఆయన స్వేచ్ఛకు కారణం ఎవరో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ కేసులో సీబీఐ ఒక్కో తీగ లాగుతూ అవినాష్‌రెడ్డి ప్రమేయాన్ని బయటపెట్టే సమయంలో దర్యాప్తు అధికారిపైనే కేసు పెట్టారు.
అవినాష్‌ను సీబీఐ అనుమానితుడిగా గుర్తించిన వెంటనే ఒక కన్ను మరో కంటిని పొడుచుకుంటుందా? అంటూ ఆయనకు క్లీన్‌చీట్ ఇచ్చేస్తూ, దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడారు. సీబీఐ లాంటి సంస్థే ఆయనే కుట్రదారని చెబుతుంటే అందుకు విరుద్దంగా జగన్ మాట్లాడటమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి నిందితులకు ఎవరు మద్దతిస్తున్నారో తేలిపోతోంది.