CM Review Meeting On Sand Supply And Directs Reforms :రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, ధరలు, అక్రమ రవాణా, సరఫరా ఇతర ఫిర్యాదులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సీఎం ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై ముఖ్యమంత్రి మరోమారు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యతను పెంచాల్సిందిగా సీఎం ఆదేశించారు. రవాణా, తవ్వకం వ్యయం భారం వినియోగదారులపై ఎక్కువగా పడకుండా చూడాలని సూచించారు. జిల్లాల్లో ఇసుక ధరల్ని పునః సమీక్షించాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వారిని ఇబ్బందులు పెట్టొద్దు : జిల్లాల్లోని ఇసుక రీచ్ లలో పూర్తిస్థాయిలో ఇసుక తవ్వకాలపై చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లాస్థాయి శాండ్ కమిటీలు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని మరోమారు అధికారులకు సూచనలు ఇచ్చారు. రీచ్ లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని సీఎం తెలిపారు. అలాగే ఇసుక ధరల్ని కట్టడి చేసేందుకు జిల్లా స్థాయిలో ధరల్ని పునః సమీక్షించాలని సూచించారు.
'మా గ్రామంలో ఇసుక రీచ్లు వద్దు' - వాహనాలకు అడ్డంగా బైఠాయించిన గ్రామస్థులు