ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతి మండలంలోనూ భూకుంభకోణం - కబ్జాదారులపై చర్యలు తప్పవన్న చంద్రబాబు - CBN Praja Darbar in NTR Bhavan - CBN PRAJA DARBAR IN NTR BHAVAN

CM Chandrababu Praja Darbar at NTR Bhavan: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు సమర్పించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారితో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. గత ఐదు సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

CM Chandrababu Praja Darbar
CM Chandrababu Praja Darbar (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 3, 2024, 1:04 PM IST

Updated : Aug 3, 2024, 2:14 PM IST

CM Chandrababu Praja Darbar at NTR Bhavan:మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. చంద్రబాబును కలిసి వినతులు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బాధితులతో ఎన్టీఆర్ భవన్ కిటకిటలాడింది. సీఎం ప్రతి ఒక్కరి వద్దకెళ్లి వినతులు తీసుకునేలా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు తీసుకున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామంటూ సీఎంకు పలువురు వినతులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ వేధింపులతో బాధితుల్లా మిగిలామని మరికొందరి ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వినతులు అన్నింటిని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

మహిళా శిశుసంక్షేమంపై సీఎం చంద్రబాబు సమీక్ష - CBN Review Four Departments

Chandrabau Chit Chat in NTR Bhavan: గత ఐదు సంవత్సరాలలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రెవెన్యూ సమస్యలకు కారణమై అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని తెలిపారు. రికార్డులు కూడా తారుమారు చేశారన్నారు. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగటం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు వెల్లడించారు. ప్రతీ జిల్లాలో కూడా రెవెన్యూ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రెవెన్యూ శాఖను ఎంత దారుణంగా నిర్వీర్యం చేశారో మదనపల్లి ఘటనే ఓ ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలన్నీ గాడిలో పెడతామని ఆయన తెలిపారు.

మైనింగ్ అక్రమాలు తవ్వితీయండి - అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు - CBN ON MINING IRREGULARITIES

భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన అన్నారు. వచ్చిన వినతులన్నీ శాఖల వారీగా విభజించి నిర్దిష్ట కాలపరిమితి లోపు పరిష్కారమయ్యేలా కార్యాచరణ రూపొందించుకున్నామని తెలిపారు. ప్రజలు దూర ప్రయాణాలు చేసి అమరావతి వరకూ రాకుండా జిల్లాల వారీగా మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు వినతులు తీసుకునేలా ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. తన పర్యటనల సందర్భంగా ఎవ్వరూ ఇబ్బంది పడకుండా పోలీసు వ్యవస్థలోనూ మార్పులు తెస్తామన్నారు. శాఖల వారీ సమీక్షలు సత్ఫలితాలను ఇస్తున్నాయని స్పష్టం చేశారు.

వల్లభనేని వంశీ బాధితులు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ బాధితలం అంటూ కేసరపల్లి వాసులు పొటెత్తారు. పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయించారని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు. మాజీ మున్సిపల్ కమిషనర్ సాయంతో తమకు చెందిన 6 ఎకరాల పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నాడు డీజీపీని కలిసినా అధికారం అండతో తమకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పక సమస్య పరీష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు.

నామినేటడ్ పదవుల ఆశావహులు:పార్టీ కార్యాలయంలో దాదాపు రెండున్నర గంటలకుపైగా గడిపిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూర్చొనే తీరక కూడా లేకుండా వినతులు వెల్లువెత్తాయి. వాహనం దిగినప్పటి నుంచి మళ్లీ బయలుదేరేవరకూ పార్టీ కార్యాలయం మొత్తం కలియతిరిగి ప్రతీ ఒక్కరి దగ్గరికీ నేరుగా వెళ్లి వినతులు స్వీకరించారు. నామినేటడ్ పదవుల ఆశావహులు పార్టీ కార్యాలయానికి వచ్చి తమ వినతులు అధినేతకు ఇచ్చేందుకు పోటీపడ్డారు.

రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి: సీఎం చంద్రబాబు - CM CBN Review on Electricity

Last Updated : Aug 3, 2024, 2:14 PM IST

ABOUT THE AUTHOR

...view details