CM Instructions to Probationary ASPs and DSPs:రాష్ట్రంలో నేరాల నియంత్రణే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మళ్లీ శాంతి భద్రతలను గాడిలో పెట్టాలని శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రోబెషనరీ ఏఎస్పీలు, డీఎస్పీలు సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. గతంలో రౌడీలు రాజకీయాల్లోకి వచ్చినా పార్టీలు మద్దతు తెలిపేవి కావని ఇప్పుడు నేరస్తులే రాజకీయ ముసుగు వేసుకున్నారని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ప్రత్యర్ధుల్ని వారి కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్టు సీఎం తెలిపారు. గత ఐదేళ్లలో కొందరు కళింకిత పోలీసు అధికారులు కూడా ఇష్టారీతిన వ్యవహరించి వ్యవస్థకు చెడ్డపేరు తెచ్చారని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం పోలీసులను శాంతి భద్రతల కోసం కాకుండా రాజకీయ నేతలపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ హబ్‌గా రాష్ట్రాన్ని మార్చేసిందని ఆరోపించారు. రాష్ట్రం నుంచే అన్ని చోట్లకు పంపిణీ జరిగేదని ఈ కారణంగానే నేరాల సంఖ్య బాగా పెరిగిపోయిందని అన్నారు. గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడంపైనా ప్రస్తుతం దృష్టిపెట్టామని సీఎం స్పష్టం చేశారు.
విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు -25 కి.మీ మేర డబుల్ డెక్కర్ విధానం