CM Chandrababu at NTR Death Anniversary Programme in Mydukur : ఇల్లు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆలోచనలు బాగుంటాయని, ఇంటి పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉంటేనే ఏదైనా సాధించగలం అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర’ కోసం అందరూ కలిసి పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్’ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
"మన దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తపించారు. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాం. పారిశుద్ధ్య సాధన దిశగా దేశ ప్రజలంతా చేతులు కలపాలి. జపాన్‌లో రోడ్లు కూడా ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి. అక్కడ కాగితం కూడా జేబులో పెట్టుకుని ఇంట్లోని చెత్తబుట్టలో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తను రోడ్డుపై పోస్తున్నాం. గతంలో ఏ ఊరు వెళ్లినా చెత్తాచెదారం కనిపించేది. గ్రామాల్లో మహిళల పరిస్థితి చూసి ఎంతో బాధపడేవాడిని. ఆరోజుల్లో వంట చేయడం మహిళలకు నరకంగా ఉండేది. దీపం కార్యక్రమం కింద ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఇప్పుడు దీపం-2 కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆరోజు మేం ఇచ్చిన నివేదిక మేరకు స్వచ్ఛభారత్ కార్పొరేషన్ తెచ్చారు" అని చంద్రబాబు తెలిపారు.
అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్ల రెగ్యులరైజేషన్‌కు కేబినెట్ ఓకే- అయితే?
"స్వచ్ఛ ఆంధ్ర కోసం సేవకులుగా పని చేస్తామని చాలా మంది వచ్చారు. సమాజహితం కోసం కష్టపడేవారిని మనమంతా గుర్తించాలి. మైదుకూరులో సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కోసం పని చేయాలి. తరతరాలుగా వస్తున్న అలవాట్లు త్వరగా పోవు. మంచి అలవాట్లు పాటించేందుకు చాలా సమయం పడుతుంది. చెడు ఆలోచనలు, చెడు పనులు చేయకుండా మన మైండ్‌ను నిత్యం మనమే కంట్రోల్ చేయాలి. పని ప్రాంతాన్ని కూడా అందరూ శుభ్రంగా ఉంచుకోవాలి ’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.