తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఉగాది పండుగతో ప్రారంభం! - FREE BUS SCHEME IN AP

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది పండుగకు అందించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు - కర్ణాటక, తెెలంగాణ, దిల్లీలోని విధానాలను పరిశీలించిన ఏపీ అధికారులు

AP RTC FREE BUS SCHEEME FOR WOMEN
FREE BUS SCHEEME IN AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2024, 6:41 PM IST

Free Bus Scheme in Andhra Pradesh :ఉగాది పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్​లోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఉన్నతాధికారులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ఈ ఉచిత బస్సు విధానం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఫీల్డ్​ విజిట్స్​ త్వరితగతిన పూర్తి చేసి సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా తనకు అందచేయాలని సీఎం కోరారు. ఉగాది నాటికి పథకాన్ని అమలు చేసేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సీఎం చంద్రాబాబు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details