తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్ట్ షాపుల మధ్య సేల్స్ వార్ - జనవరి ఒకటిన ఏం జరిగిదంటే! - LIQUOR CHAIN STORES CLASH

ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిన రెండు మద్యం గొలుసు దుకాణాల పోటీతత్వం - ఒకరిపై మరొకరు దాడి చేసుకున్న దుకాణ యజమానులు

LIQUOR CHAIN STORES CLASH
Clashes over Competition in Liquor Chain Stores (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 4, 2025, 5:22 PM IST

Clashes over Competition in Liquor Chain Stores : రెండు మద్యం గొలుసు దుకాణాల మధ్య ఉన్న పోటీతత్వం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటన సూర్యాపేట మండలం గాంధీనగర్ పెద్దమ్మతల్లి దేవాలయం సమీపంలో జరిగింది. అసలు దుకాణంలో మద్యం విక్రయించడమే పెద్ద నేరమైతే, రెండు దుకాణాల మధ్య పోటీ వస్తోందని గొడవ పడి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. సూర్యాపేట మండలం గాంధీనగర్​లో జక్కలి అంజమ్మ, బాలెంల నాగమ్మ కుటుంబాలు పక్కపక్కనే కిరాణ దుకాణాలు నిర్వహిస్తూ అందులో మద్యం విక్రయిస్తున్నారు.

అయితే ఈ రెండు దుకాణాల మధ్య పోటీ ఉండటంతో జక్కలి అంజమ్మ, బాలెంల నాగమ్మ మధ్య వ్యాపార విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ఇదే విషయంపై ఇరువర్గాల కుటుంబ సభ్యులు ఘర్షణ పడ్డారు. బాలెంల నాగమ్మతో పాటు మరో పది మంది జక్కలి అంజమ్మ దుకాణంపై వెళ్లి గొడవకు దిగారు. ఆపై జక్కలి అంజమ్మతో పాటు ఆమె భర్త రమేశ్​, కుమారుడు విగ్నేశ్​ మరో ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరలవుతోంది.

ఇరువర్గాలపై పోలీసు కేసులు :దాడికి పాల్పడిన వారిలో నోముల శివ అనే యువకుడిపై జక్కలి అంజమ్మ వర్గీయులు కూడా ప్రతిదాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడున్న ఓ వ్యక్తి ఘర్షణ దృశ్యాలను తన మొబైల్​ ఫోన్​లో చిత్రీకరించగా అవి కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలసుకున్న స్థానిక పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు.

యథేచ్చగా మద్యం విక్రయాలు : గొలుసు దుకాణంలో జరుగుతున్న ఈ అక్రమ వ్యాపారాలను ఆబ్కారీ, పోలీసులు అడ్డుకుంటున్నా ఎక్కడో ఓ చోట ఈ దందా కొనసాగుతోంది. వైన్స్​ షాప్​నకు పోటీగా పట్టణాల్లో, పల్లెల్లో రాత్రింబవళ్లు అనే తేడాలేకుండా యథేచ్చగా మద్యం విక్రయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు హెచ్చరించినా ఎక్కడో ఓ చోట మద్యం గొలుసు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఊరికో రేషన్ షాపులా బెల్ట్ షాపు అందుబాటులో ఉంటోంది.

Liquor: బెల్ట్​ షాపుల్లో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

వైరల్ వీడియో : నడిరోడ్డుపై ఏరులై పారిన మద్యం - బాటిళ్ల కోసం ఆశగా ఎదురుచూసిన జనం

ABOUT THE AUTHOR

...view details