తెలంగాణ

telangana

ETV Bharat / state

'నాకు లెగ్​ పీస్ వేయలే - నేను డబ్బులివ్వను' : చికెన్ కోసం పగిలిన తల - CLASH FOR LEG PIECE IN SURYAPET

లెగ్‌ పీస్ కోసం ఇద్దరి మధ్య గొడవ - యువకుడి తల పగులకొట్టిన చికెన్ షాప్ సిబ్బంది - చివరికి గ్రామ పెద్దల వరకు చేరిన పంచాయితీ

Clash Between Two Persons For Leg Piece in Suryapet
Clash Between Two Persons For Leg Piece in Suryapet (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2025, 10:23 AM IST

Clash Between Two Persons For Leg Piece in Suryapet :చికెన్ లెగ్‌ పీస్ ఒకరి తల పగులకొట్టిస్తే, మరొకర్ని చితకబాదేలా చేసింది. దీనిపై పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదవ్వని ఈ ఘటన మేళ్లచెరువులో మూడ్రోజుల నుంచి చర్చనీయాంశంగా మారింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు 3 రోజుల కిందట మేళ్ల చెరువులోని ఓ చికెన్ దుకాణానికి వచ్చి, అందులో పని చేస్తున్న యువకిడికి చికెన్ ఆర్డరిచ్చాడు.

ఈ క్రమంలో వారిద్దరి మధ్య లెగ్‌ పీస్‌లపై వాదన మొదలైంది. ఇచ్చిన చికెన్‌లో తను అనుకున్నట్లు లెగ్‌ పీస్‌ వేయలేదని, అందుకు తాను డబ్బులు ఇవ్వబోనని కొనుగోలుదారుడు అన్నాడు. దాంతో గొడవ పెరిగి మరింత పెద్దగైంది. కోపోద్రిక్తుడైన దుకాణంలో పని చేసే యువకుడు చికెన్ కోసం వచ్చిన యువకుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో అతని తల పగిలింది. అక్కడున్న వారు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దుకాణం యజమాని బాధితుడిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లాడు.

'ఇగో' తీసిన ప్రాణం : హారన్​ కొడితే అవమానంగా ఫీలయ్యాడు - లారీకి ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయాడు

మరో వివాదం : యజమాని అక్కడకు వెళ్లడంతో మరో వివాదం చోటుచేసుకుంది. చికెన్ విషయంలో ఇలా కొడతారా అని బాధితుడి తరఫు బంధువులు దుకాణ యజమానిని చితకబాదారు. దీంతో ఇరువర్గాలు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కారు. అటు నుంచి గొడవ మళ్లీ రెండు గ్రామాల పెద్ద మనుషుల వద్దకెళ్లింది. 3 రోజుల పంచాయితీ అనంతరం తల పగులకొట్టిన యువకుడికి జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని, తాము మాట్లాడుకుంటామని చెప్పారని, మళ్లీ ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు.

అడిగితే రూ.300 ఇవ్వలేదని - ముగ్గురు కలిసి ఫ్రెండ్​ను చంపేశారు

సినిమా రేంజ్‌లో మర్డర్‌ - భయంతో తలుపులు వేసుకున్న స్థానికులు - పోలీసులు వచ్చేసరికి?

ABOUT THE AUTHOR

...view details