Civils Ranker Uday Krishna Reddy :ఐదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆ యువకుడు పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చిన్నా చితకా పనులు చేస్తూ, కూరగాయలు అమ్ముతూ పెంచి పెద్ద చేసిన నాయనమ్మ కష్టాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ పుస్తకాలతో కుస్తీ పట్టారు. తొలిసారి కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి ఇంటి బాధ్యతలు చూసుకున్నాడు.
ఇప్పుడు ఏకంగా సివిల్స్‌లో 780వ ర్యాంకు సాధించి, తనను పెంచి పోషించిన నానమ్మ కళ్లలో వెలుగులు నింపాడు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్‌కృష్ణారెడ్డి ప్రస్థానమిది. భర్తతోపాటు కుమారుడు, కోడలు మృతి చెందినప్పటికీ రమణమ్మ తన మనవళ్ల చదువు కోసం చెమటోడ్చి, వారి జీవితాలకు అక్షర బాటలు వేసి ఉన్నత శికరాలధిరోహించేెంది చేయూతనందించింది.
ఎంచుకున్న లక్ష్యంపై దృష్టి - మొక్కవోని దీక్షతో సివిల్స్‌లో విజయం - AP CANDIDATES IN UPSC CIVILS
UPSC Result 2024 Andhra Pradesh : మనవడు ఉదయ్‌కృష్ణారెడ్డిని స్వగ్రామంలోనే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివించింది రమణమ్మ. నెల్లూరు జిల్లా కావలిలోని ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చేస్తున్న రోజుల్లో సెలవుల్లో నాయనమ్మకు చేదోడుగా ఉంటూనే మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు ఉదయకృష్ణ. 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి 2019 వరకు విధులు నిర్వహించారు.