DS Chauhan on Paddy Procurement :ఈ ఏడాది యాసంగి మార్కెటింగ్ సీజన్ ప్రారంభమైన దృష్ట్యా, గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహన్(DS Chauhan) పేర్కొన్నారు. ఇవాళ మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన, క్షేత్రస్థాయి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోళ్ల పనితీరు పరిశీలించారు.
రాష్ట్రంలో ధాన్యం సేకరణ సక్రమంగానే జరుగుతోంది : డీఎస్ చౌహాన్ - DS Chauhan on Grain Procurement
DS Chauhan visit Paddy centers :ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానీయవద్దని డీఎస్ చౌహన్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ కేంద్రాల నుంచి రవాణా చేయబడిన వరి ధాన్యం అన్‌లోడ్ చేసే ప్రక్రియ పరిశీలించడానికి, పలు రైస్ మిల్లులను కూడా ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో నేరుగా మాట్లాడారు. స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది పనితీరు ఎలా ఉందంటూ ఆరా తీశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన రైతు పల్లా సందీప్‌కు ఫోన్ కాల్ చేశారు. ధాన్యం సేకరణ, నగదు చెల్లింపు ప్రక్రియలో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని వడ్లు కాంటా వేసిన 2 రోజుల్లో సొమ్ము తన బ్యాంకు ఖాతాలో జమైందని లబ్ధిదారుడు తెలిపారు. ఆ రైతు నుంచి లభించిన సంతృప్తికరమైన స్పందన చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రం సిబ్బందిని కమిషనర్ చౌహాన్ అభినందించారు.