రైతులను నిరుత్సాహ పరిచేలా వార్తలు రాయొద్దు: డీఎస్ చౌహాన్ DS Chauhan on Paddy Procurement in Telangana : రాష్ట్రంలో ఇప్పటివరకు 83 శాతం ధాన్యానికి చెల్లింపులు జరిగాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే డబ్బులు పడ్డాయని రైతులు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని గుర్తు చేశారు. హైదరాబాద్లో పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
DS Chauhan Clarity on Paddy Procurement : ధాన్యం తీసుకువస్తున్న రైతులతో నేరుగా మాట్లాడానని, అన్నదాతలకు ఫోన్ చేసి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నానని డీఎస్ చౌహన్ చెప్పారు. అంతా బాగానే ఉందని చాలా మంది కర్షకులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రైతులను నిరుత్సాహ పరిచేలా వార్తలు రాయొద్దని మీడియా సంస్థలకు సూచించారు. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నామని వెల్లడించారు. గతంలో ఏప్రిల్ తొలి వారం తర్వాతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారని కానీ ఈ ఏడాది మార్చి 25వ తేదీ లోపే కొనుగోలు కేంద్రాలు తెరిచామని పేర్కొన్నారు.
వరికి రూ.500 బోనస్ సన్న రకం నుంచి మొదలుపెట్టాం : భట్టి విక్రమార్క - Bhatti Clarity on Bonus for Paddy
"తెలంగాణ బియ్యానికి ఒక బ్రాండ్ ఉంది, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇప్పటికే 83 శాతం ధాన్యానికి చెల్లింపులు జరిగాయి. అవగాహన లేని సిబ్బంది వల్ల కొన్నిచోట్ల పొరపాట్లు జరిగాయి. తొలి త్రైమాసికంలోనే పౌరసరఫరాల శాఖలో రూ.6 వేల కోట్ల అప్పు తీర్చాం. అకాల వర్షాల వల్ల కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది." - డీఎస్ చౌహన్, పౌరసరఫరాల శాఖ కమిషనర్
Paddy Procurement Centers in Telangana : రాష్టంలో దాదాపు 80 కొనుగోలు కేంద్రాలను తాను పరిశీలించానని చౌహన్ తెలిపారు. మొత్తం 7,241 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతోందని వివరించారు. ఇప్పటివరకు 83 శాతం ధాన్యానికి చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. ధాన్యం అమ్మిన 3 రోజుల్లోనే డబ్బులు పడ్డాయని రైతులు చెప్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఒకట్రెండు చోట్ల ఏమైనా పొరపాట్లు జరిగితే జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ధాన్యం సేకరణ వెయ్యి పాళ్లు నయం : మంత్రి తుమ్మల - THUMMALA ON PADDY PROCUREMENT