Precautions to be Taken Before Adopting a Child in Telugu :పిల్లలను అనాథాశ్రమం నుంచి లేదా ఇతరుల నుంచి దత్తత తీసుకునేందుకు ఓ ప్రక్రియ ఉంటుంది. అందులో కొన్ని న్యాయపరమైన అంశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ఈ అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. అవసరాన్ని బట్టి లాయర్‌ను కూడా సంప్రదించవచ్చు. దీనికంటే ముందుగా దత్తత తీసుకునే ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిది.
పిల్లలను దత్తత తీసుకునే విషయం గురించి ముందుగా భార్యాభర్తలిద్దరూ చర్చించుకోవాలి. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తే, వాటిని ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధమవ్వాలి. అయితే ఈ విషయంలో కుటుంబసభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. దీనిపై కుటుంబ సభ్యులకు భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ వారి సందేహాలను సాధ్యమైనంత వరకు నివృత్తి చేసి, ఏకాభిప్రాయానికి వచ్చే వరకు సముదాయించాలి. దీంతో భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశమూ తక్కువగా ఉంటుంది.
హెచ్చరిక : పసి పిల్లలను అలా కొనుక్కోవడం "నేరం" - ఇలా తెచ్చుకోవడమే "న్యాయం"! - Child Adoption Rules
అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలి : చాలా మంది పిల్లలు కొత్తవారితో కలిసిపోలేరు. అలాగే చాలా మందికి దత్తత తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన ఉండకపోవచ్చు. దీని గురించి ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, స్వయంగా అనుభవం ఉన్నవారికే పూర్తి వివరాలు తెలుస్తాయి. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోవడం ఉత్తమం. దాంతో పిల్లలతో అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో, వారితో ఎలా మెలగాలో తెలుసుకోవచ్చు. ఫలితంగా దత్తత విషయంలో ముందుగానే ఒక స్పష్టమైన అభిప్రాయానికి వస్తారు.