Chandrababu Interact with Women:మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన వ్యక్తి దివంగత నేత ఎన్టీఆర్ అని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ఆడ బిడ్డలు బాగా చదువుకోవాలని మహిళా యూనివర్సిటీలు స్థాపించారు. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. టీడీపీ. డ్వాక్రా సంఘాలకు అప్పలను మాఫీ చేశా. ఈనాడు ఆడపిల్లలకు ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే., ఆ అవకాశం నేనే కల్పించానని చంద్రబాబు వెల్లడించారు. వైసీపీ అధినేత జగన్ మాత్రం, ఆయన చెల్లెమ్మకు ఆస్తి కాకుండా అప్పులు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాక ముందు ముద్దులు పెట్టాడు, వచ్చాక గుద్దుడే గుద్దుడు అని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా శక్తి కోసం టీడీపీ అనేక పథకాలు చేపట్టబోతుందని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్ఠం చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధి బొండపల్లిలో మహిళల ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. మోసగాళ్లు మరలా వస్తారు. రక రకాల మాటలు చెప్తారని మహిళను హెచ్చరించారు. గతాన్ని గుర్తు చేసుకోండి. ఆడవాళ్లకు పుట్టినిల్లు టీడీపీ. మహిళలకు రాజకీయంగా అవకాశం కల్పించి, వారికి పదవులు కల్పించింది టీడీపీ అని చంద్రబాబు తెలిపారు. ఆడ బిడ్డలు చదువుకునేందుకు ప్రతి కిలోమీటర్‌కు ఒక మండల పరిషత్ పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్ ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రతి పది కిలోమీటర్ పరిధిలో ఒక జూనియర్ కళాశాల తీసుకొచ్చామన్నారు.
ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు- ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా జగన్? - CM Jagan Election Campaign