Central Team To Assess Flood Damage in AP :రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రబృందం పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఏపీలో పర్యటిస్తోంది. తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు కేంద్ర బృందానికి వరద పరిస్థితిని వివరించారు. అనంతరం అన్ని శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర బృందం సమావేశమైంది. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా వరద నష్టం తీవ్రతను వివరించారు.
Flood Affected Areas In AP : బుడమేరుకు వరద ఏ విధంగా వచ్చింది. నగరాన్ని ఏ విధంగా ముంచెత్తిందనే అంశాన్ని కేంద్ర బృందానికి ఇరిగేషన్ అధికారులు వివరించారు. వరద ఉద్ధృతి కృష్ణా నది వరద వల్ల నీట మునిగిన పంటల వివరాలను అందించారు. ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణా నదికి వరద వచ్చిందని తెలిపారు. పది రోజుల పాటు పెద్ద ఎత్తున వరద సహయక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన - ఏర్పాట్లు సిద్ధం - Central Team in Flood Areas
Central Team visit Flood Areas :వరదల వల్ల ఏపీకి అపార నష్టం సంభవించిందని తెలిపారు. లక్షలాది ఇళ్లు నీట మునిగాయని 7 లక్షల మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాథమికంగానే 6,882 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయన్నారు. ఇంకా ఎన్యూమరేషన్ కొనసాగుతోందని సిసోడియా తెలిపారు. గోదావరి, వంశాధార, నాగావాళి నదుల వరద ఉద్ధృతి గోదావరి జిల్లాలు సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగిన నష్టాన్ని కేంద్రబృందానికి వివరించారు.