తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లుండి రాష్ట్రానికి కేంద్ర బృందం రాక - వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన, నష్టంపై అంచనా - CENTRAL TEAM VISIT To FLOOD AREAS - CENTRAL TEAM VISIT TO FLOOD AREAS

Central Team Visit To Flood Areas : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం వరద ముంపు ప్రాంతాల్లో ఈనెల 11న పర్యటించనుంది. ఈమేరకు కీర్తిప్రతాప్‌ సింగ్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రానుంది. రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.

Central Team Visit AP Flood Affected Areas
Central Team Visit AP Flood Affected Areas (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 9, 2024, 7:22 PM IST

Updated : Sep 9, 2024, 8:33 PM IST

Central Team Visit TG Flood Affected Areas : రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా, వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనుంది.

ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులున్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తున్న కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ గారితో ఫోన్లో మాట్లాడి, ఆదివారం నాటి తన ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను, బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించారు.

వాగులు ఉప్పెనలా ఊర్లను ముంచెత్తిన వైనం :ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌ పర్యటించారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర అమాత్యులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించారు. ఏరియల్‌ సర్వే ద్వారా నష్టపోయిన పంటలతో పాటు ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు.

మున్నేరు, పాలేరు, ఆకేరు, కట్టలేరు వాగులు ఉప్పెనలా ఊర్లను ముంచెత్తిన వైనం చూసి చలించిపోయారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి చౌహాన్‌కు వివరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలని అమాత్యులు విన్నవించగా, రాష్ట్ర ప్రజలను కేంద్రం ఇతోధికంగా ఆదుకుంటుందని శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భరోసా ఇచ్చారు.

Unuion Minister Kishan Reddy Visits Khammam Flood Areas :మరోవైపు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి సైతం తాజాగా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకోవాల్సిన అవరసం ప్రభుత్వంపైనా ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర విపత్తు నిధులను వినియోగించుకోని బాధితులకు సత్వరమే నిత్యావసర వస్తువులతో పాటు తాత్కాలిక నివాసాలు కల్పించాలని కోరారు. ప్రకృతి సృష్టించిన వైఫరీత్యం అందరం కలిసి కట్టుగా ఎదుర్కొవాలని, రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని కిషన్‌రెడ్డి కోరారు. అలానే కేంద్ర బృందాలు వచ్చి సర్వే చేస్తాయని తర్వాత కేంద్రం నిధులు ఇస్తుందని తెలిపారు.

కల్యాణ ఘడియల్లో కన్నీటి ఘోష - భారీగా నష్టపోయిన 'వివాహ' కుటుంబాలు - Massive Loss Due to Floods

'వరద బాధితులకు కేంద్రం సాయం ప్రకటించింది - రాష్ట్ర ప్రభుత్వం చర్యలపై దృష్టి సారించాలి' - DK Aruna on Flood In Telangana

Last Updated : Sep 9, 2024, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details