Central Government Approves Second Rail Route Via Basara :మహారాష్ట్రలోని ముథ్కెడ్ నుంచి ఆదిలాబాద్‌లోని బాసర మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని డోన్ వరకు రెండో రైల్వే లైన్ మంజూరైంది. ఈ రైల్వై లైన్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మహారాష్ట్రలోని ముథ్కెడ్ నుంచి బాసర మీదుగా నిజామాబాద్ వరకు సంబంధింత అధికారులు అవసరమైన భూమిని సేకరించారు. కాగా నిజామాబాద్ నుంచి కర్నూల్ జిల్లా డోన్ వరకు భూసేకరణ చేయాల్సి ఉంది.
బాసర మీదుగా రెండో లైన్ పూర్తయితే జిల్లా వాసులకు రైలు సౌకర్యం మెరుగుపడనుంది. గతేడాది సాధారణంగా ఉన్న రైల్వే లైన్‌ను విద్యుత్తు లైన్‌గా మార్చారు. దీంతో ప్రస్తుతం బాసర మీదుగా సుమారు 50 రైళ్లు రాకపోకలు చేస్తున్నాయి. డబుల్ లైన్ పూర్తయితే మాత్రం సంఖ్య పెరగడంతో పాటు ప్రయాణం సులభతరం అవుతుంది. బాసర మీదుగా నడిచే రైలు ఆగడంతో బాసరకు వచ్చే భక్తుల సంఖ్య కూడా రెండింతలు పెరుగుతోందని అధికారులు భావిస్తున్నారు. మేడ్చల్ నుంచి ఒకే లైన్ ఉండటంతో క్రాసింగ్ ప్రయాణం కారణంగా ఆలస్యం అవుతుంది. ఇది పూర్తయితే దర్శనానికి వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలోనూ ఎలాంచి సమస్యలు ఎదుర్కొరు.
ఆదిలాబాద్ టూ ఆర్మూర్ రైల్వేలైన్ కోసం ఏళ్లుగా పోరాటం - ఇకనైన ఆ జిల్లా వాసుల కల నెరవేరేనా ?