తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Jun 23, 2024, 7:48 PM IST

Updated : Jun 23, 2024, 7:56 PM IST

ETV Bharat / state

మారణాయుధాలతో బెదిరిస్తూ - సెల్​ఫోన్ చోరీ చేస్తున్న ముఠా అరెస్టు - Cell phone theft Masood gang arrest

Smart Phone Theft Gang Arrested : సామాన్యులను మారణాయుధాలతో భయపెడుతూ, హైదరాబాద్​లో వరుస సెల్​ఫోన్ చోరీలకు పాల్పడుతున్న మసూద్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మారణాయుధాలు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

Cell Phone Theft Masood Gang Arrested
Smart Phone Theft Gang Arrested (ETV Bharat)

Cell Phone Theft Masood Gang Arrested : నగరంలో కలకలం సృష్టించిన కరుడుగట్టిన సెల్‌ఫోన్ చోరీ ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 19న అర్థరాత్రి చోరీలతో భయానక వాతావరణాన్ని సృష్టించిన మసూద్ ఉర్‌ రెహమాన్, ఫజల్ ఉర్‌ రెహమాన్ అనే ఇద్దరి నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి ద్విచక్ర వాహనం, మారణాయుధాలు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మసూద్​పై గతంలో నాచారంలో ఒకటి, మైలార్​దేవ్​పల్లిలో రెండు కేసులు ఉన్నట్లు తెలిపారు.

గోల్డ్​ ట్రేడింగ్​లో పెట్టుబడుల పేరిట భారీ మోసం - 500 మంది దగ్గరి నుంచి రూ.కోట్లలో వసూలు! - Investment Fraud in Hyderabad

ఈ కేసులో ప్రధాన నిందితుడు మసూద్ విలాసాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే తరహా కేసుల్లో గతంలో అరెస్ట్ అయినట్లు తెలిపారు. ఈనెల 19న బంధువుల ఇంటికి వచ్చిన మసూద్ స్నేహితుడైన ఫజల్​కి ఫోన్ చేశాడు. ఇద్దరూ కలిసి 19న అర్ధరాత్రి ఛాదర్​ఘాట్ వైపు వెళ్లిన నిందితులు అక్కడ రోడ్డుపై ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు. దాన్ని మలక్‌పేటలోని స్వాగత్ హోటల్ వద్ద పార్క్ చేసి రాత్రి గం2.30 సమయంలో సికింద్రాబాద్ వైపు వెళ్లారు.

గణేశ్​ ఆలయం సమీపంలో స్టేషన్ వైపు వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద సెల్‌ఫోన్ చోరీచేసేందుకు ప్రయత్నించగా, అతను అడ్డుకున్నాడు. వెంటనే తమ వద్ద ఉన్న కత్తితో బెదిరించి సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లారు. వారు తప్పించుకుని వెళ్లే క్రమంలో అక్కడ ఉన్న వారికి కత్తులు చూపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఘటనాస్థలంలో బాధితుడు సాయం కోసం కేకలు వేయడంతో రంగంలోకి దిగిన యాంటీ స్నాచింగ్ టీమ్ నిందితులను వెంబడించింది.

ఇద్దరు కానిస్టేబుళ్లు నిందితులను వెంబడించారు. ఇదే క్రమంలో మరో చోరీ చేసేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో నిందితులపై పోలీసులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక బులెట్ నిందితుడు మసూద్ కాలిలో దిగింది. అయినా పారిపోయేందుకు ప్రయత్నించగా మరో కాల్పులు జరిపినా ఉపయోగం లేకపోయింది. దీంతో పరారైన నిందితుల కోసం గాలించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి 48 గంటల్లో పట్టుకున్నారు.

మియాపూర్​లో​ ప్రభుత్వ భూముల ఆక్రమణకు చెక్​ - ఈ నెల 29 వరకు 144 సెక్షన్​ విధింపు - Miyapur Govt Land Encroachment news

అమెరికాలో దుండగుడి కాల్పులు - తెలుగు యువకుడి దుర్మరణం

Last Updated : Jun 23, 2024, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details