CBI Court Adjourned Kavitha Trial to June 3 : దిల్లీ మద్యం కేసులో భాగంగా మనీలాండరింగ్ కేసులో, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సహా ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈనెల 10న మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఈడీ, కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంది.
దిల్లీ లిక్కర్ స్కాం - కోర్టు పరిగణనలోకి ఈడీ అనుబంధ ఛార్జ్‌షీట్ - ED Attached charge sheet for Court
Delhi Liquor Scam Update : దేశంలో సంచలనం సృష్టించిన మద్యం విధానం మనీలాండరింగ్ కేసుపై ఇవాళ దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. ఈనెల 10న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఇతర నిందితులపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఇందులో కవిత, చరణ్ ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా ఈడీ పేర్కొంది. కాగా పలువురికి ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసిన కోర్టు, తదుపరి విచారణను జూన్ 3కు వాయిదా వేసింది.
Delhi Liquor Scam Update (eenadu.net)
Published : May 29, 2024, 5:14 PM IST
ఈడీ అరెస్టుతో ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత, చరణ్‌జీత్‌లకు రౌస్ అవెన్యూ కోర్టు, ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌ను అరెస్టు చేయకపోవడం వల్ల, వచ్చేనెల 3న కోర్టుకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 3కి వాయిదా వేసింది.