CBI Case on Mega Engineering Company: బిల్లుల మంజూరు కోసం లంచం ఇచ్చిన అభియోగంపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ మేఘాపై ఛత్తీస్‌గఢ్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ), మెకాన్ సంస్థల అధికారులకు రూ.78 లక్షల ముడుపులు ఇచ్చి రూ.174 కోట్ల బిల్లులు పొందినట్లు సీబీఐ అభియోగించింది. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఆ సంస్థ జీఎం సుభాష్ చంద్ర సంగ్రాస్ పేర్లను ఎఫ్ఐఆర్లో సీబీఐ చేర్చింది.
సీబీఐ కస్టడీలో కవిత - వారి వాంగ్మూలాల ప్రకారం విచారణ! - Kavitha cbi Arrest in Liquor Scam
Mega Engineering Company Case: మేఘా సంస్థ(Mega Engineering Company)కు చెందిన ఎనిమిది మంది ఎన్ఎండీసీ, ఇద్దరు మెకాన్ సంస్థల అధికారులనూ నిందితులుగా కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ జగదల్ పూర్లోని నగర్ నార్ స్టీల్ ప్లాంట్‌లో రూ.314 కోట్లతో బావి, పంప్ హౌజ్, పైప్‌లైన్ సిస్టం నిర్మించి అయిదేళ్ల పాటు నిర్వహించేందుకు మేఘా కంపెనీతో ఎన్ఎండీసీ 2015 జనవరి 23న ఒప్పందం చేసుకుంది. స్టీల్ ప్లాంటు ప్రాజెక్టు నిర్వహణ, నిర్మాణాల పర్యవేక్షణ బాధ్యతను రాంచీలోని మెకాన్ లిమిటెడ్(Macon Ltd Company)కు ఎన్ఎండీసీ అప్పగించింది.
సందేశ్‌ఖాలీ అల్లర్లపై CBI విచారణ- కలకత్తా హైకోర్టు కీలక ఆదేశం - Sandeshkhali Case CBI