Case Registered on YSRCP Leaders due To Vote Deletion of TDP Sympathisers: రాష్ట్రవ్యాప్తంగా దొంగ ఓట్లు (vote) నమోదు, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. విశాఖపట్నం, గుంటూరుతో పాటు పలు జిల్లాలో వందల సంఖ్యలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాల్లో కేంద్ర ఎన్నికల సంఘం కలెక్టర్, ఇద్దరు సీఐ, ఎసై, కానిస్టేబుల్‌పై వేటు వేసింది. అధికార పార్టీ దాహానికి కింద స్థాయి అధికారులు (Officers) బలైపోతున్నారు.
అంతా వాళ్లే చేశారు ! - తప్పుడు ఫాం-7లు దరఖాస్తు చేసి అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నాయకులు
Complaint About Vote Deletion to Election Commission: తాజాగా టీడీపీకి చెందిన 42 మంది ఓట్లను తొలగించాలంటూ ఫాం-7 (Form7) కింద తప్పుడు సమాచారంతో దరఖాస్తు (Apply) చేసిన 8 మంది వైఎస్సార్సీపీ నేతలపై (YSRCP Leaders) పోలీసులు కేసు నమోదు చేశారు. వైయస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన బంగారు మునిరెడ్డి కుటుంబంతో పాటు బంధువుల ఓట్లను తొలగించాలని స్థానిక సర్పంచ్ కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు దస్తగిరిరెడ్డితో పాటు మరో ఆరుగురు కలిసి రెవెన్యూ అధికారులకు ఫాం-7 కింద దరఖాస్తులు అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేత (tdp leader) బంగారు మునిరెడ్డి ఎన్నికల సంఘానికి (EC) ఫిర్యాదు చేశారు.