తెలంగాణ

telangana

ETV Bharat / state

ట్రైన్ ప్రయాణికులకు ముఖ్య గమనిక - ఆ వైపు వెళ్లే 41 రైళ్లు రద్దు - TRAINS CANCELLED DUE TO CYCLONE

దానా తుపాను హెచ్చరికల నేపథ్యం - 23, 24, 25, 27 తేదీలలో ఈస్ట్​-కోస్ట్​ పరిధిలో పలు రైళ్లు రద్దు

Some Trains Cancellation Due to Dana Cyclone in AP
Some Trains Cancellation Due to Dana Cyclone in AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 22, 2024, 8:16 PM IST

Updated : Oct 22, 2024, 9:51 PM IST

41 Trains Cancellation Due to Dana Cyclone :‘దానా’ తుపాను ప్రభావంతో సౌత్ సెంట్రల్ రైల్వే అప్రమత్తమైంది. మొత్తం 41 ట్రైన్స్​ను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో సర్వీసులందించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన రైళ్ల వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువగా హావ్‌డా, భువనేశ్వర్‌, ఖరగ్‌పుర్‌ (వెస్ట్​ బంగాల్), పూరి తదితర చోట్ల నుంచి ఇతర ప్రాంతాలకు సర్వీసులందించే రైళ్లే అధికంగా ఉన్నాయి. దానా తుపాను ప్రభావంతో అక్టోబర్‌ 23 నుంచి ఒడిశాలోని తీర ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వర్షాలూ కురుస్తాయని గోపాల్‌పుర్‌ ఐఎండీ అధికారులు ఇటీవల వెల్లడించారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని సూచనలు చేశారు.

తుపాను నేపథ్యంలోరద్దైన రైళ్లు వివరాలు :

S.No Train No. From To Date Of Journey
01 22504 దిబ్రూఘర్ - కన్యాకుమారి 23-10-2024
02 17016 సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ 23-10-2024
03 12840 MGR చెన్నై సెంట్రల్- హౌరా మెయిల్ ఎక్స్‌ప్రెస్ 23-10-2024
04 12868 పుదుచ్చేరి-హౌరా ఎక్స్‌ప్రెస్ 23-10-2024
05 22826 MGR చెన్నై సెంట్రల్- షాలిమార్ ఎక్స్‌ప్రెస్ 23-10-2024
06 12897 పుదుచ్చేరి-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ 23-10-2024
07 18464 KSR బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ 23-10-2024
08 11019 CST ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ 23-10-2024
09 12509 SMVT బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్ 23-10-2024
10 12514 సిల్చార్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 23-10-2024
11 12552 కామాఖ్య - SMVT బెంగళూరు 23-10-2024
12 18046 హైదరాబాద్ - హౌరా 23-10-2024
13 22503 కన్యాకుమారి- దిబ్రూగర్ 23-10-2024
14 12704 సికింద్రాబాద్ - హౌరా 23-10-2024
15 22888 SMVT బెంగళూరు - హౌరా 23-10-2024
16 03429 సికింద్రాబాద్ -మాల్దా టౌన్ 23-10-2024
17 12864 యశ్వంత్​పూర్ - హౌరా 23-10-2024
18 06087 తిరునవెల్లి- షాలిమార్ 23-10-2024
19 17479 పూరి- తిరుపతి 24-10-2024
20 06095 తాంబరం-సంత్రగచ్చి 24-10-2024
21 12703 హౌరా-సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ 24-10-2024
22 22603 ఖరగ్‌పూర్-విల్లుపురం SF ఎక్స్‌ప్రెస్ 24-10-2024
23 12073 హౌరా - భువనేశ్వర్ ఎక్స్​ప్రెస్​ 24-10-2024
24 18045 షాలిమార్ - హైదరాబాద్ 24-10-2024
25 22851 సంత్రాగచి- మంగళూరు సెంట్రల్ 24-10-2024
26 12841 షాలిమార్ - చెన్నై సెంట్రల్​ 24-10-2024
27 12663 హౌరా - తిరుచురపల్లి 24-10-2024
28 12863 హౌరా - SMVT బెంగళూరు 24-10-2024
29 18047 షాలిమార్ - వాస్కోడిగామా 24-10-2024
30 12839 హౌరా చెన్నై సెంట్రల్​ 24-10-2024
31 22644 పట్నా - ఎర్నాకులం 24-10-2024
32 06090 సంత్రాగచ్చి -చెన్నై సెంట్రల్ 24-10-2024
33 12842 చెన్నై సెంట్రల్ - హౌరా 24-10-2024
34 22808 చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి 24-10-2024
35 15227 SMVT బెంగళూరు- ముజాఫర్​పూర్ 24-10-2024
36 17015 భువనేశ్వర్ - సికింద్రాబాద్ 25-10-2024
37 18463 భువనేశ్వర్ - KSR బెంగళూరు 25-10-2024
38 20896 భువనేశ్వర్ - రామేశ్వరం 25-10-2024
39 12513 సికింద్రాబాద్- సిల్చర్ 26-10-2024
40 20895 రామేశ్వరం - భువనేశ్వర్ 27-10-2024
41 12246 SMVT బెంగళూరు-హౌరా 24-10-2024
Last Updated : Oct 22, 2024, 9:51 PM IST

ABOUT THE AUTHOR

...view details