CAG Report on Asara Pensions Distribution :బడుగు, బలహీన వర్గాల ప్రజలు, పేద కుటుంబాలకు గౌరవప్రదమైన, సురక్షితమైన జీవితం గడిపేందుకు సామాజిక భద్రతలో భాగంగా గత ప్రభుత్వం 2014లో ఆసరా పింఛన్ల పథకాన్ని(Asara Pension Scheme) ప్రారంభించిందని కాగ్ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 మధ్యకాలంలో ఆసరా పథకం ఏ విధంగా అమలైందనే విషయాలను తెలుసుకోవడానికికాగ్(CAG) ఆడిట్ నిర్వహించింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు అందించిన రికార్డులను పరిశీలించిన తర్వాత పథకం అమలులో పలు అక్రమాలు, పర్యవేక్షణా లోపాలు ఉన్నట్లు గుర్తించింది.
సమగ్ర కుటుంబ సర్వేను ప్రాతిపదికగా తీసుకొని ఆసరా పింఛన్ల లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ రెండింటిని పోల్చినప్పుడు 19శాతం కుటుంబాల వివరాలు అందుబాటులో లేవని తేలింది. పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి మంజూరు వరకు సరైన విధివిధానాలు పాటించలేదని కాగ్ గుర్తించింది. దరఖాస్తుదారులు అర్హులేనా కాదా అని తేల్చడానికి పెట్టిన నిబంధనలు తేల్చడానికి సాంకేతిక పరిజ్ఞానం పూర్తిస్థాయిలో ఉపయోగించలేదని తేల్చింది. లబ్ధిదారుల్లో అనర్హులున్నారనే విషయం గుర్తించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాగ్ అభ్యంతరం తెలిపింది. ఎంపిక చేసుకున్న జిల్లా నుంచి నాలుగు మండలాలను, రెండు పట్టణాలను ఎంచుకున్నారు. దరఖాస్తులు, లబ్ధిదారుల సర్వే నిర్వహించారని అలాగే లబ్ధిదారుల అర్హత, అనర్హత తేల్చడానికి ఇతర ప్రభుత్వ శాఖల డేటాను ఉపయోగించుకున్నారని కాగ్ తన నివేదికలో తెలిపింది.
2018 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలానికి బడ్జెట్(Budget)లో రూ.27,188 కోట్లు కేటాయించారు. ఇందులో రాష్ట్ర వాటా రూ.26,232 కోట్లు, కేంద్రం వాటా రూ.956 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తంలో రూ.23,093 కోట్లను ఖర్చు చేశారు. మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల్లో ఉన్నప్పటికీ పూర్తిగా ఖర్చు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(Society for Elimination of Rural Poverty) లెక్క చూపినట్లు కాగ్ పరిశీలనలో తేలింది. ఆసరా లబ్ధిదారులుగా తేల్చడానికి పలు నిబంధనలు ఏర్పాటు చేశారు. కానీ చాలామందికి అర్హత లేకపోయినా లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు కాగ్ తనిఖీల్లో బయటపడింది. పథకం మార్గదర్శకాలకు విరుద్ధంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కాగ్ గుర్తించింది. రిజిస్టర్లు కూడా సరిగ్గా నిర్వహించలేదని తేలింది.
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పగుళ్లు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు