Budget Allocation for Six Guarantees in Telangana 2024 :అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో గ్యారంటీల జల్లు కురిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. అందులో రూ.500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ.723 కోట్లు కేటాయించింది. అలాగే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్ల నిధులు మంజూరు చేసింది.
గృహజ్యోకి పథకానికి ఎంతంటే? :అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానికి తీసుకొచ్చిన గృహజ్యోతి పథకం ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ ఉపయోగించే ఇళ్లకు ఉచిత కరెంట్ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చి దరఖాస్తులను తీసుకుని అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్‌ను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.
జులై 15నాటికి 45,81,676 గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందించామని, ఈ పథకం కింద జూన్ వరకు సప్లై చేసిన విద్యుత్‌కు డిస్కంలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.585.05 కోట్లుగా వివరించారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లు ప్రతిపాదించింది.
బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి పెద్దపీట - రూ.72,659 కోట్లు కేటాయింపు - telangana budget 2024 highlights