తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్లలో గులాబీ జెండా మరోమారు ఎగరడం ఖాయం : కేటీఆర్ - KTR on Chevella Constituency - KTR ON CHEVELLA CONSTITUENCY

KTR in Chevella Parliament Meeting : చేవెళ్లలో బీఆర్​ఎస్​ గెలవడం ఖాయమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ సమీక్షలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్​ ఎంపీ రంజిత్​రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిల వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు.

KTR About Chevella Candidate Kasani Gnaneshwar
KTR in Chevella Parliament Meeting

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 10:46 PM IST

KTR About Chevella Candidate Kasani Gnaneshwar :చేవెళ్లలో గులాబీ జెండా మరోమారు ఎగరడం ఖాయమని బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ కేటీఆర్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలె యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, పార్టీ నేత కార్తీక్ రెడ్డి, ఇతరులు సమావేశానికి హాజరయ్యారు.

కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి చేవెళ్ల ప్రజల నుంచి సానుకూల స్పందన లభించడంతో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తుందని కేటీఆర్ తెలిపారు. 30 సంవత్సరాల పాటు బడుగు, బలహీన వర్గాలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల కోసం పని చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల్లో గెలుపు తథ్యమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. స్థానికుడైన జ్ఞానేశ్వర్ రంగారెడ్డి ప్రజల కష్టసుఖాలు, అన్ని ప్రాంతాలపైన సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు అని పేర్కొన్నారు.

కాసాని జ్ఞానేశ్వర్ విజయం ఖాయం :బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్ చేవెళ్ల బహిరంగ సభ తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ విజయం ఖాయమైందని, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని మాజీ మంత్రి కేటీఆర్​ తెలిపారు. చేవెళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు.

బీఆర్​ఎస్​ అధికారంలో ఉన్నన్ని రోజులు అధికారాన్ని అనుభవించి పార్టీకి, నాయకత్వానికి నమ్మక ద్రోహం చేసి వెళ్లిన రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డిల వైఖరిని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. గులాబీ పార్టీ, కేసీఆర్ వారికి ఏం తక్కువ చేశారని ప్రశ్నిస్తున్నారన్నారని అన్నారు. ఒక పార్టీ పట్ల నిబద్ధతలేని నాయకులను ప్రజలు నమ్మరని, అధికారం కోసం జెండాలు మార్చే వాళ్లని తిరస్కరిస్తారని కేటీఆర్ అన్నారు.

KTR Tweet on Congress Government :కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన విధానంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. అన్ని వర్గాల ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కానీ 120 రోజుల్లో నిరుద్యోగులు సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చింది కానీ, వాటిని అమలు చేయడంలో విఫలమైందని పేర్కొన్నారు.

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి సీఎం రేవంత్​ రెడ్డి : కేటీఆర్ - KTR Interesting Comments on Revanth

ప్రజలారా మేల్కొండి - వాళ్ల కుట్రలను అర్థం చేసుకోండి : కేటీఆర్​ - Ambedkar Jayanthi Celebrations

ABOUT THE AUTHOR

...view details