తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంత ఆఫర్ చేస్తుందో ? - కేటీఆర్​ ట్వీట్​ వైరల్​ - KTR on Joinings in Telangana - KTR ON JOININGS IN TELANGANA

KTR Counter To Congress : కాంగ్రెస్​ను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్​ చేస్తోందని, మరి తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు కాంగ్రెస్​ ఎంత ఆఫర్​ చేస్తుందో అని ఎక్స్​ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు.

KTR about Party Joinings in Telangana
KTR Counter To Congress

By ETV Bharat Telangana Team

Published : Jul 13, 2024, 10:04 PM IST

Updated : Jul 13, 2024, 10:41 PM IST

KTR about Party Joinings in Telangana :ప్రస్తుతం రాష్ట్రంలోని బీఆర్​ఎస్​ శాసనసభ్యులు ఆ పార్టీని వీడుతున్న వేళ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యేకు బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేస్తోందని, తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ ఎంత ఆఫర్ చేస్తుందో అన్న ఆశ్చర్యం కలుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మీరు ఎంత ధర నిర్ణయించారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్ల మొత్తం ఆర్ఆర్ఆర్, కల్కి 2898ఏడీ కంటే ఎక్కువగా ఉంటుందా అని కేటీఆర్ అడిగారు.

ఎమ్మెల్యేల చేరికలపై కేటీఆర్​ ట్వీట్​ :ప్రస్తుతం తెలంగాణలో బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​లోకి ఎమ్మెల్యేల చేరికల పర్వం కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​లోకి ఇప్పటి వరకు తొమ్మిదిమంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు చేరారు. మరోవైపు ఒకట్రెండు రోజుల్లో కూడా మరో ఐదారుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్​లో చేరనున్నట్లు ఆ​ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు ఖైరతాబాద్‌ నుంచి దానం నాగేందర్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి కడియం శ్రీహరి, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్‌ మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. అప్పటికే దానం నాగేందర్​తో సహా పలువురి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్​ఎస్​ నేతలు స్పీకర్​ను విన్నవించగా హైకోర్టులో కూడా పిటిషన్​ వేశారు. మరోవైపు లోక్​సభ ఎన్నికల తర్వాత చేరికల్లో జోరు పెరిగింది, దీంతో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్​ ఎమ్మెల్యేల చేరికలపై ఆసక్తికరంగా ట్వీట్​ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కొండ నాలుకకు మందేస్తే - ఉన్న నాలిక ఊడినట్లుంది : కేటీఆర్ - KTR Tweet On Pension Recovery

సీఎంకు దిల్లీ చక్కర్లు, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరగడమే తెలుసు - ప్రజలు అవసరం లేదు : కేటీఆర్​ - ktr tweet Gopanpally flyover issue

Last Updated : Jul 13, 2024, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details