BRS MP Venkatesh Netha Joined Congress : బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పలువురు గులాబీ నేతలు హస్తం కండువా కప్పుకున్నారు. వారి వెంట ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారు సమాలోచనలు చేసినట్టు సమాచారం.
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ - కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత - కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ వెంకటేశ్
BRS MP Venkatesh Netha Joined Congress : బీఆర్ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు
Published : Feb 6, 2024, 10:40 AM IST
|Updated : Feb 6, 2024, 12:23 PM IST
ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ఉచ్చులో పడొద్దని ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి హెచ్చరించిన విషయం తెలిసిందే. పార్టీ ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలకు హస్తం నాయకులు పాల్పడుతున్నారని వాటిని తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలవడంపై అనవసరంగా రచ్చ చేస్తున్నారని, మంచి ఉద్దేశంతో కలిసినా బద్నామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. కానీ తాజాగా బీఆర్ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్‌లో చేరడం చర్చనీయాంశంగా మారింది.
8 నుంచి బడ్జెట్ సమావేశాలు - అసెంబ్లీ వేదికగా మరో 2 గ్యారంటీలు ప్రకటించనున్న సీఎం!