Bail Issued For Padi kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్రవాగ్వాదం చేసుకొని సమావేశం రసాభాసగా మారింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు.
షరతులతో కూడిన బెయిల్ :దీంతో పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం మంగళవారం కరీంనగర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు హాజరుపరచారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కౌశిక్ రెడ్డిపై ఉన్న మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారం లోగా రూ.2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్‌రెడ్డి చెప్పారు.
ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : అంతకుముందు కరీంనగర్ మూడో పట్టణ పోలీసు స్టేషన్ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మంత్రులు నిర్వహించిన సమీక్షలో తీవ్రవాగ్వాదం :ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్రవాగ్వాదం చేసుకొని సమావేశం రషాభాసగా మారింది. దీనిపై ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి చేయిచేసుకున్నారని సంజయ్ పీఏ వినోద్ ఫిర్యాదు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి తనను తిట్టాడంటూ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కౌశిక్‌రెడ్డి ప్రవర్తనతో అంతరాయం కలిగిందంటూ కరీంనగర్ ఆర్డీవో ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం హైదరాబాద్‌కు వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.