తెలంగాణ

telangana

ETV Bharat / state

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు - కారు ఢీకొన్న టిప్పర్ ఇదే - ఎమ్మెల్యే లాస్య నందిత కేసు విచారణ

BRS MLA Lasya Nandita Car Accident Case : ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యే కారు ఢీకొన్న టిప్పర్‌ను గుర్తించారు. ఆ వాహనం నడిపిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Lasya Nanditha Car Accident Case Update
MLA Lasya Nandita Car Accident Case

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 10:14 AM IST

BRS MLA Lasya Nanditha Car Accident Case Update: కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గత నెల 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లాస్య నందిత కారు ఢీకొన్న టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే లాస్య నందిత కారు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రామేశ్వరం బండ సమీపంలో ఓఆర్‌ఆర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. కారు నడుపుతున్న ఆకాశ్‌ నిద్ర మత్తులో ముందు వెళ్తున్న టిప్పర్‌ను బలంగా వెనక నుంచి ఢీకొట్టారు.

Tipper Driver Arrested In MLA Lasya Nanditha Accident: అనంతరం ఓఆర్‌ఆర్‌ రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే మృతి చెందారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదం జరిగిన సమయంలో రింగ్​రోడ్డు నుంచి ఏయే వాహనాలు వెళ్లాయో క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులు, వాటి డ్రైవర్లను విచారించారు. చివరకు టీఎస్‌ 08 యూజే 0025 అనే నంబరు గల టిప్పర్‌ను ఎమ్మెల్యే కారు ఢీకొన్నట్లు గుర్తించారు.

టిప్పర్‌ వెనక భాగంలో ఉన్న సిగ్నల్‌ లైటు బోర్డు పగిలిపోయింది. కొద్దిగా పైభాగంలో ఉన్న గార్డు లాంటి ఇనుప భాగం పక్కకు వంగిపోయింది. పోలీసులు దీని డ్రైవర్‌ను గుర్తించి విచారిస్తున్నారు. అసలు ఆరోజు ఏం జరిగిందనే వివరాల కోసం ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరిగినట్లు డ్రైవర్‌ గుర్తించాడా? ఇబ్బందులు ఎదురవుతాయని ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడా? అనేది విచారిస్తున్నారు.

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసు - ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొనడంతోనే ప్రమాదం!

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందితను వరుస ప్రమాదాలు వెంటాడాయి. గత నెల 13న నల్గొండలో భారత్ రాష్ట్ర సమితి నిర్వహించిన బహిరంగ సభకు లాస్య నందిత హాజరయ్యారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్​ వస్తుండగా మార్గమధ్యంలో నార్కట్‌పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అదే వేగంతో వెళ్లి ట్రాఫిక్ నియంత్రిస్తున్న హోంగార్డులను ఢీకొంది.

ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఓ హోంగార్డు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. అదే నెల 23న జరిగిన రోడ్డు ప్రమదంలో లాస్య నందిత మరణించారు. గతేడాది ఫిబ్రవరి 19న ఆమె తండ్రిసాయన్న (MLA Sayanna) కన్నుమూశారు. ఏడాది వ్యవధిలోనే తండ్రీ కుమార్తె మృతితో వారి కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి కేసులో కీలక అప్డేట్ - టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

సీట్​బెల్ట్, హెల్మెట్​లే శ్రీరామరక్ష - అది పాటించకుంటే తప్పదు జీవిత శిక్ష!

ABOUT THE AUTHOR

...view details