తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణమాఫీ కాలేదని నిరసనకు దిగితే అరెస్టు చేస్తారా? - ఇదెక్కడి అరాచకం : హరీశ్​రావు - HARISH RAO ON FARMERS ARRESTS - HARISH RAO ON FARMERS ARRESTS

Harish Rao Tweet On Adilabad Farmers Arrests : రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేస్తారా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ జిల్లాలో రైతుల అరెస్టు హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారా అని నిలదీశారు.

BRS MLA Harish Rao On Adilabad Farmers Issue
BRS On Adilabad Farmers Issue (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 2:07 PM IST

BRS MLA Harish Rao On Adilabad Farmers Issue : రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లాలో నిరసన వ్యక్తం చేసిన 11 మంది రైతులను అరెస్టు చేయండంపై భారత్ రాష్ట్ర సమితి తీవ్రంగా స్పందించింది. రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించడం సిగ్గుచేటని అన్నారు. పోలీసు యాక్ట్ పేరు చెప్పి జిల్లాలో నిరసనలు, ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకుం జారీ చేయడం హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు.

ఆదిలాబాద్​లో రైతుల నిరసనలు: రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని తీవ్రంగా ఖండించారు. రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు, వ్యవసాయ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోతున్నారని ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు.

అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా, పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం, అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని హరీశ్ రావు మండిపడ్డారు. ఒకవైపు రైతుబంధు రాక, మరోవైపు రుణమాఫీ కాక అన్నదాత ఆవేదనలో ఉన్నారని వ్యవసాయ పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారని తెలిపారు. ఏక కాలంలో ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆచరణలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యారని, నమ్మి ఓటేసినందుకు రైతన్నను నట్టేట ముంచారని మాజీమంత్రి ఆరోపించారు.

రుణమాఫీ 46 శాతమే జరిగింది : హరీశ్​రావు - Harish Rao On CM Revanth

'కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట శాపంగా మారింది. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం ఏనాడూ బాగుపడ్డట్లు చరిత్రలో లేదు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పాలకులు మరిచిపోయినట్లున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలి. ఆందోళనలో ఉన్న రైతాంగానికి భరోసా కల్పించాలి. అదిలాబాద్ సహా ఇతర జిల్లాల్లో రైతన్నలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదంటే అరెస్టు చేసిన రైతన్నలకు అండగా బీఆర్ఎస్ కార్యాచరణ ప్రకటిస్తుంది.' అని ప్రభుత్వాన్ని హరీశ్ రావు హెచ్చరించారు.

రుణమాఫీ చేయకుండానే అబద్దపు ప్రకటనలు : రైతు రాజ్యం కాదిది, పోలీసు రాజ్యం అన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిరసన అనేది ప్రజాస్వామిక హక్కని, అణచివేస్తే ఆగిపోతుందనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. రూ.15000 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టి రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసి రెండు లక్షల వరకు రుణాలు తీర్చేశామని చెప్పుకున్నారని మండిపడ్డారు. అన్ని రుణాలు మాఫీ అయితే రైతులు రోడ్డెందుకు ఎక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండానే పూర్తయిందని సీఎం, మంత్రుల అబద్దపు ప్రకటనల కారణంగానే రైతులు ఆందోళనకు గురై నిరసనలు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

అధికార పీఠం ఎక్కగానే కాంగ్రెస్ నేతల కళ్లు నెత్తిమీదకు ఎక్కాయని నిరంజన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వానికి బుద్దిచెబుతారని తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, మహిళలు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం వంచించిందన్న ఆయన రైతుల మీద పెట్టిన కేసులను భేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరకొర రుణమాఫీ చేసి రైతుల ఆందోళనకు, మానసిక వేదనకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు.

సిద్దిపేటలో టెన్షన్​ టెన్షన్ - ఉద్రిక్తతతకు దారితీసిన బీఆర్ఎస్ ధర్నా - High Tension In Siddipet

ABOUT THE AUTHOR

...view details