BRS MLA Harish Rao React on Telangana Budget : రైతులకు ఎన్నికల హామీల్లో చాంతాడంత చెప్పారు కానీ బడ్జెట్లో మాత్రం రైతులకు చెంచాడంత పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బడ్జెట్(Telangana Budget)లో వ్యవసాయానికి కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఇంత తక్కువ మొత్తంలో కేటాయించడం వల్ల పంటల బీమా, పంటల బోనస్, రైతు భరోసా(Rythu Barosha)కు నిధులు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మరికొంత మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
డిసెంబరు 9వ తేదీనే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని నాటి విషయాలను హరీశ్ రావు(Harish Rao) గుర్తు చేశారు. ఈ రూ.2 లక్షల రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవసరమని అన్నారు. కనీసం ఈ బడ్జెట్లో రుణమాఫీకి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. పంటల బోనస్‌కు రూ.15 వేల కోట్లు అవసరం, కానీ బడ్జెట్లో రూపాయి కూడా పెట్టలేదని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే రూ.82 వేల కోట్లు అవసరమవుతాయని స్పష్టం చేశారు. కానీ బడ్జెట్ పద్దును చూస్తే కేవలం రూ.16 వేల కోట్లతో సరిపెట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.
గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉంది - ప్రభుత్వం తన విజన్‌ను ఆవిష్కరించలేదు : హరీశ్‌రావు
Harish Rao Comments on Budget :ఇవాళ రైతులకు 24 గంటల కరెంటు ఎక్కడ ఇస్తున్నారో చూపించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సవాల్ విసిరారు. మొదటి అసెంబ్లీ సమావేశంలో ఆరు గ్యారంటీల(Congress Six Guarantees)పై చట్టం చేస్తామన్నారు. రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, ఆరు గ్యారంటీలపై చట్టం చేయలేదని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు.