BRS Mallareddy Assembly Video : పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డా ఈ డైలాగ్ వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి. ఓ రాజకీయ నాయకుడిగా ఆయన ఎంత పాపులరో సోషల్ మీడియాలో అంతకు మించిన పాపులారిటీ ఆయనది. ఆయన ఏ మీటింగ్‌లో పాల్గొన్నా అక్కడ ఓ పంచ్ డైలాగ్ పేలాల్సిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేయాల్సిందే. మల్లారెడ్డి మాట్లాడుతున్నారంటే ఓవైపు మీమర్స్, మరోవైపు సోషల్ మీడియా వారియర్స్ రెండు చెవులు అప్పగించి వింటుంటారు. ఏ మాటను వైరల్ చేద్దామా, ఏ డైలాగ్‌తో మీమ్ రెడీ చేద్దామా అని ఈగర్‌గా ఎదురుచూస్తుంటారు.
Minister Mallareddy Dance In Kukatpally : మరోసారి డ్యాన్స్ ఇరగదీసిన మంత్రి మల్లారెడ్డి.. వీడియో వైరల్
మల్లారెడ్డి కూడా తన సోషల్ మీడియా పాపులారిటీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టే కనిపిస్తారు. తన ఆన్‌లైన్ ఫ్యాన్స్‌ను ఖుష్ చేసేలా కొన్నిసార్లు ఆయన ప్రసంగాలు ఉంటాయి. ఇక తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేసిన ఓ రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఈ వీడియోను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు. మల్లన్నా మజాకా, అట్లుంటది మా మల్లన్నతో అని తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో ఇంత రచ్చ చేస్తున్న ఈ వీడియోలో ఏం ఉందో మీరూ ఓ లుక్కేస్తారా? ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.
చూశారుగా పై వీడియో. ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో కృష్ణా జలాలపై వాడివేడి చర్చ జరిగింది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ నేతలు, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఈ వ్యవహారంపై హాట్ డిబేట్ జరిగింది. ఇక సభ కన్‌క్లూడ్ అయ్యే సమయంలో చివరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన కుర్చీ నుంచి లేచి మాట్లాడేందుకు ప్రయత్నించారు. తాను ఓ విజ్ఞప్తి చేయాలని, మాట్లాడ్డానికి తనకూ ఓ ఛాన్స్ ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. ఓవైపు స్పీకర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకముందే మల్లారెడ్డి తన రిక్వెస్ట్‌ను ఆయన ముందు ఉంచారు. ఆ రిక్వెస్ట్‌ను విని సభాపతితో పాటు సభలోని వారందరూ షాకవ్వడమే గాక గొల్లున నవ్వారు. ఇంతకీ ఆయన రిక్వెస్ట్ ఏంటో తెలుసా?
ఈనెల 14, 15వ తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయని మల్లారెడ్డి సభ దృష్టికి తీసుకువెళ్లారు. కాబట్టి ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని స్పీకర్‌ను కోరారు. ఎంతో సీరియస్‌గా ఒక్క ఛాన్స్ అడిగి చివరకు ఈ రిక్వెస్ట్ సభ ముందు పెట్టడంతో అప్పటిదాకా వాడివేడిగా చర్చ జరిగిన సభ ఒక్కసారిగా నవ్వులతో సందడిగా మారింది.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి రెండేళ్లు పెంపు
సాగునీటి ప్రాజెక్టులపై తీర్మానానికి శాసనసభ ఆమోదం - రేపటికి వాయిదా