BRS Focus on Parliament Elections 2024: అసెంబ్లీ పోరులో హ్యాట్రిక్ విజయంపై కన్నేసి ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సర్వశక్తులు కూడదీసుకుంటోంది. అందులో భాగంగా లోక్‌సభ నియోజవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. సోమవారంతో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఒక్కో అసెంబ్లీ నియోజవకవర్గం నుంచి సగటున 70 నుంచి వంద మంది వరకు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సమావేశాలకు హాజరయ్యారు. సమావేశాలకు వచ్చిన నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు.
హైదరాబాద్ బీఆర్ఎస్ నేతల్లో వర్గపోరు - ప్రాధాన్యం లేకుండా ఎన్నాళ్లు పనిచేయాలంటూ అసహనం
BRS Meeting in Hyderabad: శాసనసభ ఎన్నికల్లో ఓటమి కారణాలను తెలుసుకోవడం, పార్టీని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యచరణపై సమావేశాల్లో ప్రధానంగా దృష్టి సారించారు. కొద్ది మంది నేతలు సమావేశంలో బహిరంగంగా తమ అభిప్రాయాలు తెలపగా మిగిలిన వారు లిఖితపూర్వకంగా ఇచ్చారు. సమావేశాల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణ అమలు చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. అన్ని స్థాయిల్లోనూ పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తామని కార్యకర్తలు, ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పిస్తామని ముఖ్యనేతలు హామీ ఇచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయాలను క్రియాశీలం చేయడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం వంచి కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది.
"మావల్ల జరిగిన లోపాలను తెలుసుకున్నాము. నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ, హక్కుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకుంటామని కార్యకర్తలు చెప్పారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటారు."-మధుసూదనాచారి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
'కారు' సర్వీసింగ్‌కు వెళ్లింది - త్వరలోనే హైస్పీడ్‌తో దూసుకొస్తుంది : కేటీఆర్