ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - దంపతులు మృతి - BLAST IN CRACKERS COMPANY - BLAST IN CRACKERS COMPANY

Blast in Fire Crackers Factory at Maredupalle : చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలయ్యాయి.

Fire Cracker Factory Blast
నకిలీ లైసెన్స్‌తో బాణాసంచా తయారీ - టపాసులు పేలి దంపతులు మృతి (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 24, 2024, 1:30 PM IST

Updated : Aug 24, 2024, 1:59 PM IST

Blast in Fire Crackers Factory at Maredupalle of Chittoor District : చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లెలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందారు. యజమాని ఖాదర్​ బాషాతో పాటు ఆయన భార్య షాహినా మృతి చెందగా ఓ బాలుడుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఖాదర్​ బాషా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పాడి ఆవు, రెండు లేగ దూడలు కూడా మరణించాయి. భారీ శబ్ధంతో పేలుడు జరిగిందని స్థానికులు తెలిపారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నకిలీ లైసెన్స్‌తో యజమాని బాణసంచా తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు పేలుడుకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. బాణసంచా తయారీ కోసం తెప్పించుకున్న నల్లమందే పేలుడుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నకిలీ లైసెన్స్‌తో బాణాసంచా తయారీ - టపాసులు పేలి దంపతులు మృతి (ETV Bharat)
Last Updated : Aug 24, 2024, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details