తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు - రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు - BJP MP Raghunandan Rao comments

BJP MP Raghunandan Rao comments : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌ రావు ఆరోపించారు. మున్ముందు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డిలపైనా ఈడీ ఎఫెక్ట్ ఉంటుందని ఆయన తెలిపారు.

Raghunandan Rao comments on KCR
BJP MP Raghunandan Rao comments (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 5:18 PM IST

Updated : Jun 13, 2024, 6:56 PM IST

Raghunandan Rao comments on KCR : మెదక్ ఎంపీ రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌) కేసు నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. మున్ముందు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డిపైనా ఈడీ ఎఫెక్టు ఉంటుందని తెలిపారు. మెదక్‌ పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన విజయోత్సవ సభలో రఘునందన్‌ రావు పాల్గొన్నారు.

రఘునందన్​ రావుకు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్​రావు - Harish Rao Greetings Raghunandanrao

ప్రజలు నిరూపించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బుతో గెలవలేరని, ప్రజలు నిరూపించారని ఆయన తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చుపెట్టిన వెంకట్రామిరెడ్డి గెలవలేదని రఘునందన్‌రావు పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్‌ స్థానం నుంచి గెలిచి, మోదీకి గిఫ్ట్ ఇచ్చామన్నారు. వెంకట్రామిరెడ్డి రూ.లక్ష కోట్లకు అధిపతని ఆయన ఆరోపించారు. రూ.లక్ష కోట్లున్న వెంకట్రామిరెడ్డి ఓటుకు ఎంత విలువ ఉంటుందో, పూటకు బువ్వ లేని బీజేపీ కార్యకర్త ఓటుకు కూడా అంతే విలువ ఉంటుందన్నారు.

బుధవారం సిద్దిపేటలో జరిగిన సమావేశానికి తాను ఎంపీగా గెలిచి వస్తానని, హరీశ్‌రావు కలగనలేదని రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఎంపీగా తనను ఓడించాలని బీఆర్ఎస్‌ చేసిన ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయని ఆయన దుయ్యబట్టారు. ప్రతి సమస్యను భారత పార్లమెంట్‌లో వినిపిస్తామని స్పష్టం చేశారు. తాను మాటల మనిషి కాదని, చేతల మనిషినని నిరూపిస్తానని తెలిపారు. అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను అక్కన్నపేట, చేగుంట స్టేషన్​లలో ఆపేవిధంగా సౌత్ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

త్వరలో రాబోయే మెదక్ మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలని ఆయన పిలుపునిచ్చారు. తన గెలుపు బీజేపీ కార్యకర్తల కృషి ఫలితమేనని పేర్కొన్నారు. తనను మెదక్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌) కేసు నమోదు చేసింది. మున్ముందు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డిపైనా ఈడీ ఎఫెక్టు ఉంటుంది. ఎన్నికల్లో డబ్బుతో గెలవలేరని, ప్రజలు నిరూపించారు. వెంకట్రామిరెడ్డి రూ.లక్ష కోట్లకు అధిపతి. రూ.లక్ష కోట్లున్న వెంకట్రామిరెడ్డి ఓటుకు ఎంత విలువ ఉంటుందో, పూటకు బువ్వ లేని బీజేపీ కార్యకర్త ఓటుకు కూడా అంతే విలువ ఉంటుంది.- రఘునందన్‌రావు, మెదక్ ఎంపీ

మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు - రఘునందన్‌ రావు కీలక వ్యాఖ్యలు (ETV BHARAT)

మల్కాజిగిరిలో ఓడిపోతే మాట్లాడని సీఎంకి మెదక్​ గురించి ఎందుకు : రఘునందన్​ రావు - BJP Raghunandan Fires On CM revanth

నా గెలుపునకు సహకరించిన హరీశ్​రావుకు ధన్యవాదాలు : రఘునందన్ రావు - BJP MP Raghunandan Rao Comments

Last Updated : Jun 13, 2024, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details