తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రలోభాల పర్వం- శేరిలింగంపల్లిలో ఓటర్లకు డబ్బుల పంపిణీ - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Money Distribution to Voters : అధికార పార్టీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డ ఘటన, శేరిలింగంపల్లిలోని ఆల్విన్‌ కాలనీలో చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం పక్కన కాంగ్రెస్ నాయకులు మహిళలకు డబ్బులు పంచుతుండగా గుర్తించిన బీజేపీ నేతలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం డబ్బులను పోలీసులకు అప్పగించారు.

Lok Sabha Elections 2024
Money Distribution to Voters (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 13, 2024, 5:53 PM IST

Lok Sabha Elections 2024 : రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కొనసాగుతోంది. పలు చోట్ల ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నేతలు డబ్బులు పంపిణీచేస్తున్నారు. తమకు అనుకూలంగా ఓటేసేందుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూ డబ్బులు పంపిణీ చేస్తున్న ఘటన శేరిలింగంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హెచ్​ఎంటీ శాతవాహన నగర్ హైస్కూలులో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు.

కొడంగల్​లో ఓటేసిన సీఎం రేవంత్ రెడ్డి - మంత్రులు ఎక్కడెక్కడ వేశారంటే? - CM Revanth Reddy Casted Vote

స్కూల్‌ పక్క గల సీసీ కెమెరా కార్యాలయంలో కాంగ్రెస్ నాయకుడు జానకీ రామరాజు తన అనుచరులతో కలిసి మహిళలకు డబ్బులను పంపిణీ చేస్తుండగా, బీజేపీ నాయకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ బ్యాగులో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు పంచుతున్న వారిపై విచారణ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికార ఓటర్లకు డబ్బులు పంచుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

EVM Whatsapp Record viral video : మహబూబాబాద్ జిల్లాలో ఈవీఎం, వీవీప్యాట్‌ వాట్సాప్‌ రికార్డు వీడియో దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. ఓటువేసి ఈవీఎంలో వీవీప్యాట్‌ స్లిప్‌ దృశ్యాన్ని రికార్డు చేసి వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్న ఘటన నెల్లికుదురు మండలం వేముల తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తె వేముల తండాకు చెందిన బానోత్ బాలకిషన్ అనే వ్యక్తి 160 పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌కు ఓటు వేసి, ఈవీఎం, వీవీప్యాట్‌ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసి వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నాడు.

ఈఘటనతో తండాలోని కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలింగ్ అధికారితో బీఆర్ఎస్ నేతలు గొడవకు దిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గొడవను శాంతింపజేశారు.ఓటు వేసిన దృశ్యాలను ఫోటో తీసి స్టేటస్‌గా పెట్టుకొన్న యువకుడు ప్రవర్తించిన తీరుసరికాదని, అతని పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు.

మహబూబాబాద్‌లో ఈవీఎం వాట్సాప్‌ వీడియో (ETV BHARAT)

వంతెన కావాలని - మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని - పలు ప్రాంతాల్లో ఎన్నికల బహిష్కరణ - TS LOK SABHA ELECTIONS BOYCOTT 2024

సీఎం రేవంత్​ రెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలి - ఈసీకి రఘునందన్‌ రావు ఫిర్యాదు - lok sabha elections 2024

ABOUT THE AUTHOR

...view details