BJP Leader NVSS Prabhakar Comments on Davos Investments : దావోస్ పర్యటనలో భాగంగా అదానీ గ్రూపుతో 12వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Davos Tour) ప్రకటించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్. ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అదానీ(Adani Investments), అంబానీకీ ప్రధాన మంత్రి మోదీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పని గట్టుకొని ప్రధానిపై విమర్శలు చేశారని మండిపడ్డారు. దావోస్ పర్యటన విషయంలో బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్ వ్యవహారం ఒకేలా ఉందని విమర్శించారు.
కేటీఆర్ తెలంగాణ ప్రతినిధిగా ఐదు సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారన్నారు. గత ప్రభుత్వం 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని గొప్పగా చెప్పింది తప్పితే.. తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో అర్థం కావటం లేదన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోయింది పెట్టుబడులు తేవడానికా.. పెట్టడానికా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుహనా లౌకిక వాదులుగా వ్యవహరిస్తూ ఇంకా విమర్శించడం తగదని హితవు పలికారు. ఈ మూడు పార్టీలు భరత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ట రోజు కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వ కూడా ఈ నెల 22న అధికారికంగా సెలవు ప్రకటించాలని కోరారు.
"కేటీఆర్ తెలంగాణ ప్రతినిధిగా ఐదు సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారన్నారు. గత ప్రభుత్వం 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని గొప్పగా చెప్పింది తప్పితే.. తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో అర్థం కావటం లేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు పోయింది పెట్టుబడులు తేవడానికా.. పెట్టడానికా అని ప్రశ్నిస్తున్నాను". - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
BJP Leader NVSS Prabhakar Fires on Congress Government : పదేళ్ల కేసీఆర్, ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలన సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో ఒకే ధోరణిలా కనిపిస్తోందని రాష్ట్ర బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ అనుసరిస్తున్న సమీక్షలు, ప్రకటనలు, పర్యటనల్లో మొత్తం కనిపిస్తుందన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి పాలిస్తే, రేవంత్ రెడ్డి దిల్లీ వేదికగా పాలన సాగిస్తున్నారని ఆ పార్టీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లక్షల్లో రేషన్ కార్డులను తొలగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఒక్క రేషన్ కార్డు తొలిగించినా, బాధితుల పక్షాన బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.