BJP Kishan Reddy Fires on BRS Govt :తెలుగురాష్ట్రాల్లో ఏప్రిల్ తొలివారంలో లోక్ సభ ఎన్నికలు ఉండే అవకాశం ఉందని బీజేపీ కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ హయాంలో బీజేపీ 350 పైగా సీట్లు గెలుస్తుందని వెల్లడించారు. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవదని అన్నారు.
Kishan Reddy on Parliament Elections 2024 :ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత 17 కోట్ల మంది సభ్యత్వంతో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని కిషన్ రెడ్డి అన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగినదని తెలిపారు. ప్రపంచంలో భారతదేశం విశ్వగురు స్థానంలో నిలిపేలా ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని వెల్లడించారు. 500 ఏళ్లుగా భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామమందిర పునర్నిర్మాణం అయ్యిందని హర్షం వ్యక్తం చేశారు.
మోదీతో పోటీకి దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వేలన్నీ చెబుతున్నాయి : కిషన్‌రెడ్డి
Kishan Reddy Comments On BRS: తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇండ్లు కట్టించకుండా మోసం చేసిందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం అప్పలపాలై ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లేనని అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా, ఓడినా వచ్చే నష్టం ఏమీలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్న ఆయన వాటిని ఎలా అమలు చేయాలనే విషయంపై ఆ పార్టీకి స్పష్టమైన రూట్‌మ్యాప్ లేదని విమర్శించారు. మోదీ పాలనలో గత తొమ్మిదేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని వెల్లడించారు.
"కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం నరేంద్ర మోదీ నేతృత్వంలో సాకారమైంది. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయోధ్య రామమందిరం. జనవరి 22న అయోధ్య రామమందిరంలో జరిగే బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని 150 దేశాల్లోని హిందువులందరూ వర్చువల్‌గా వీక్షించనున్నారు. ఇది భారతీయులందరికీ గర్వకారణం." - కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి